
ఇంటింటికీ కేంద్ర పథకాలు
కోరుట్ల రూరల్: బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రతీ ఇంటికీ పథకాలు అందిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, సంపర్క్ అభియాన్ ప్రభారి గంగాడి మోహన్ రెడ్డి అన్నారు. మండలంలోని వెంకటాపూర్‌లో బుధవారం బీజేపీ సంపర్క్ అభియాన్ నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. జిల్లా కన్వీనర్ ఒడ్డెపల్లి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు పంచిరి విజయ్ కుమార్ పాల్గొన్నారు.
కేంద్ర పథకాలపై ఇంటింటా ప్రచారం
రాయికల్: మండలంలోని వస్తాపూర్, దావన్‌పల్లి, కట్కాపూర్, తాట్లవాయి, ఆల్యనాయక్‌తండా, ధర్మాజీపేటలో మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ మండల అధ్యక్షుడు ఆకుల మహేశ్ ఆధ్వర్యంలో కేంద్ర పథకాలపై ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కల్పించారు.