
వరదకాలువకు నీరు విడుదల చేయండి
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరద కాలువకు నీరు విడుదల చేయాలని రైతు ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టర్ సత్యప్రసాద్‌కు వినతిపత్రం అందించారు. వరదకాలువకు నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని, లేకుంటే ఈనెల 8న కథలాపూర్‌లో ఆందోళన చేస్తామన్నారు. కార్యక్రమంలో వేదిక జిల్లా అధ్యక్షుడు నల్ల రమేశ్ రెడ్డి, నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి, బద్దం మహేందర్ రెడ్డి, పిడుగు ఆనందరెడ్డి, బందెల మల్లయ్య, మో హన్ రెడ్డి, సంజీవ్, మహిపాల్ పాల్గొన్నారు.
పీహెచ్‌సీల్లో మెరుగైన సేవలు
మెట్‌పల్లి రూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడారు. వైద్య సేవలు ఎలా అందుతున్నాయని తెలుసుకున్నారు. మందుల స్టాక్, ల్యాబ్, టీహబ్‌కు పంపించిన శాంపిల్స్ వివరాలు ,క్షయవ్యాధి కేసులపై ఆరా తీశారు. లెప్రసీ, టీబీ వ్యాధిగ్రస్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మండల వైద్యాధికారి ఎలాల అంజిత్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
కోరుట్ల: సైబర్ నేరాలపై విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల, మెట్‌పల్లి డీఎస్పీలు వెంకటరమణ, రాములు సూచించారు. పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు బుధవారం అవగాహన కల్పించారు. ఓటీపీ ఫ్రాడ్స్, ఇన్‌స్ర్ట్రాగాం ఫ్రెండ్స్, బ్యాంక్ లోన్ ఫ్రాడింగ్, ఏపీకే యాప్ లింక్ తదితర నేరాలతో నష్టాలను వివరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చేందుకు పట్టుదలతో చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. సైబర్ క్రైం ఎస్సైలు కృష్ణ, దినేష్, కోరుట్ల ఎస్సై ఎం.చిరంజీవి, ట్రాప్మా అధ్యక్షుడు ఎంఏ.భారి, పా ఠశాల, కళాశాలల కరాస్పాండెట్లు పాల్గొన్నారు.
భూ భారతి సమస్యలు పరిష్కరించాలి
మల్యాల: భూభారతి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. భూభారతికి వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై తహసీల్దార్ వసంతను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ తిరుపతి, రాణి, సిబ్బంది పాల్గొన్నారు.
తల్లిపాలు అమృతంతో సమానం
జగిత్యాలరూరల్: తల్లిపాలు పిల్లలకు అమృతంతో సమానమని మాతాశిశు సంరక్షణాధికారి జైపాల్‌రెడ్డి అన్నారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని జగిత్యాల రూరల్ మండలం గుల్లకోటలో మహిళలకు బుధవారం అవగాహన కల్పించారు. తల్లిపాలతో శిశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, పుట్టిన బిడ్డకు గంట వ్యవధిలో ముర్రుపాలు తాగించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతోపాటు, శిశువుకు ఆరునెలల తర్వాత ఆహారం ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో గాయత్రి, ఆరోగ్య పర్యవేక్షకులు శ్యామ్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ రాజేశ్వరి, ఏఎన్‌ఎం శోభ, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

వరదకాలువకు నీరు విడుదల చేయండి

వరదకాలువకు నీరు విడుదల చేయండి

వరదకాలువకు నీరు విడుదల చేయండి