
రాష్ట్ర సాధనే లక్ష్యంగా జయశంకర్ కృషి
కోరుట్ల: రాష్ట్ర సాధనే లక్ష్యంగా పనిచేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. జయశంకర్ 91వ జయంతి సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణకు జరిగిన అన్యాయం, అసమానతలను ఎత్తి చూపుతూ ప్రజల్లో చైతన్యదివిటి వెలిగించిన గొప్ప దార్శనికుడు జయశంకర్ అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా రైతుబంధు మాజీ అద్యక్షుడు చీటి వెంకట్రావు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, నాయకులు భాస్కర్ రెడ్డి, ఫయీం పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకు బ్రహ్మకుమారీలు రాఖీ
ఎమ్మెల్యేను కలిసిన వార్డు ఆఫీసర్లు
మున్సిపల్ వార్డు ఆఫీసర్లు ఎమ్మెల్యేను కలిశారు. టీజీపీఎస్సీ ద్వారా గ్రూప్–4 పరీక్ష రాసి వార్డు ఆఫీసర్లుగా.. కొందరం జూనియర్ అసిస్టెంట్లుగా నియమితులయ్యామని, జూనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందికి రూ.24,280 నుంచి రూ.72, 850 వరకూ స్కేల్ ఉండగా వార్డు ఆఫీసర్లకు రూ.22,240 నుంచి రూ.67,300 స్కేల్ చెల్లిస్తున్నారని, దీంతో తాము ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. పదోన్నతులను సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా మార్చేలా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. పద్మశాలీ సంఘం భవన నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయించాలని సంఘం అధ్యక్షుడు జక్కుల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యేను కోరారు.
జయశంకర్ ఆశయసాధనకు కృషి చేద్దాం
జగిత్యాలటౌన్: తెలంగాణ ఉద్యమానికి, స్వరాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన ఆచార్య జయశంకర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జయశంకర్ 91వ జయంతిని కలెక్టరేట్‌లో నిర్వహించా రు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివా ళి అర్పించారు. జయశంకర్ విగ్రహానికి అదనపు కలెక్టర్లు ప్రజాప్రతినిధులు నివాళి అర్పించారు. డీఆర్‌డీవో రఘువరణ్, డీఎంహెచ్‌వో ప్రమోద్ కుమార్, ఆర్డీవో పులి మధుసూదన్‌గౌడ్, బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ అధికారులు సునీత, రాజ్‌కుమార్, చిత్రు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ
జగిత్యాల: ధరూర్ క్యాంప్‌లోగల ఈవీఎం గో దాంను కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించారు. ఆర్డీవో మధుసూదన్, కలెక్టర్ ఏవో హకీం, జగిత్యాల అర్బన్ తహసీల్దార్ రాంమోహన్ ఉన్నారు.
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘనంగా నివాళి

రాష్ట్ర సాధనే లక్ష్యంగా జయశంకర్ కృషి