
రైతులకు సరిపడా ఎరువులు
పెగడపల్లి: జిల్లాలో యూరియా కొరత లేదని, సరిపడా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ సత్యప్రసా ద్ ఈన్నారు. సహకార సంఘాలు ఎప్పటికప్పు డు ఇన్‌డెంట్ పెట్టి తెప్పించాలని సిబ్బందిని ఆదేశించారు. పెగడపల్లి మండలం నంచర్ల సొసైటీ గోదామును బుధవారం తనిఖీ చేశారు. ఎరువు ల నిల్వలు, స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు. ఈ పా స్ ద్వారా రైతులకు ఎకరాకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేయాలని సూచించారు. ఎక్కువ మొ త్తం ఇస్తే సొసైటీ సిబ్బంది, వ్యవసాయశాఖ అధి కారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నంచర్ల సొసైటీకి మంగళవారం సుమారు 340 బస్తాల యూరియా వచ్చింది. కలెక్టర్ తని ఖీకి ముందే సిబ్బంది 162 బస్తాలు రైతులకు పంపిణీ చేశారు. ఇంకా 172 బస్తాల యూరియా ని ల్వ ఉంది. వానాకాలం పంటలకు సొసైటీ పరిధి లోని రైతులకు 238 టన్నుల యూరియా అవసరమవుతుంది. అయితే ఇప్పటివరకు కేవలం 76 టన్నులు మాత్రమే వచ్చింది. ఇంకా 162 టన్నులు రావాల్సి ఉంది. ఆ మొత్తం వస్తే రైతులకు ఇ బ్బంది లేకుండా యూరియా పంపిణీ చేసే అవకాశం ఉంది. అనంతరం కలెక్టర్ మోడల్ స్కూల్ ను సందర్శించారు. పరిసరాలు, స్టాక్ రూమ్, వంట సరుకులు, మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. పదో తరగతి గదిలో కూర్చుని విద్యార్థులకు గణితంలో టాస్క్‌ను డిజిటల్ బోర్డుపై చేయించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్య అందించాలన్నారు. వందశాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలని సూచించారు. ఆర్డీవో మధుసూదన్, డీఏవో భాస్కర్, డీఈవో రాము, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఏవో శ్రీకాంత్, విండో చైర్మన్ వేణుగోపాల్, ప్రిన్సిపాల్ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
యూరియా కొరత లేదు
రైతులూ ఆందోళన వద్దు
కలెక్టర్ సత్యప్రసాద్