
పింఛన్ పెంచేదాకా పోరాటం
జగిత్యాలటౌన్/ధర్మపురి: ప్రభుత్వం ఆసరా పింఛన్లు పెంచేదాకా పోరాటం సాగిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాది గ అన్నారు. ఈనెల 13న హైదరాబాద్‌లో నిర్వహించనున్న దివ్యాంగుల మహాగర్జన సభ సన్నాహక సమావేశాలను జిల్లాకేంద్రంతోపాటు ధర్మపురిలో నిర్వహించారు. అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ 20నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదన్నారు. ప్ర భుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించా రు. పింఛన్లు పెంచాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు హైదరాబాద్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో హాజరుకావా లని కోరారు. ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా గెలి చి.. సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్‌కు పింఛన్ల పెంపు బాధ్యత తీసుకోవాలన్నారు. వికలాంగులు, వృద్ధులు నెలకు రూ.2వేల చొప్పున ఇప్పటివరకు రూ.40వేలు నష్టపోయారని తెలిపారు. వాటిని వడ్డీతో సహా చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం నాయకులు లంక దాసరి శ్రీనివాస్, అజ్గర్‌ఖాన్, ధర్మపురి ఇన్‌చార్జి గొల్లపె ల్లి శ్రీధర్, జాతీయ కమిటీ చైర్మన్ గోపాల్‌రావు, రాయిల్ల రవికుమార్ తదితరులున్నారు.
● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ