
కల్తీ మద్యం విక్రయిస్తున్న ముఠా రిమాండ్
వేములవాడరూరల్: వేములవాడ ప్రాంతంలో కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా కల్తీ మద్యం తయారీ చేస్తూ విక్రయిస్తున్న ముఠాను ఎకై ్సజ్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఎకై ్సజ్ సీఐ రాజేశ్వర్‌రావు తెలిపిన వివరాలు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన కార్తీక్, వేములవాడ పట్టణంలో అద్దెకు ఉంటున్న సంతోష్ కలిసి తక్కువ ధర గల మద్యం కొని, బ్రాండెడ్ పేర్లు గల బాటిళ్లలో నింపుతూ విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎకై ్సజ్ పోలీసులు బుధవారం వారి ఇళ్లపై దాడి చేయగా అసలు విషయం తెలిసింది. కార్తీక్ చీప్‌లిక్కర్‌ను కొని బ్రాండెడ్ బాటిళ్లలో నింపుతూ విక్రయిస్తున్నాడు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎకై ్సజ్ పోలీసులు విచారణ చేపట్టగా తనతోపాటు మరో వ్యక్తి సంతోష్ సైతం ఉన్నట్లు తెలిపాడు. వేములవాడలోని సంతోష్ ఇంటిపై దాడి చేయగా బ్రాండెడ్ బాటిళ్లలో నింపిన మద్యం, ఖాళీ సీసాలు లభించాయి. ఇద్దరి వద్ద రూ.50వేల విలువైన మద్యం దొరికింది. ఆరు నెలలుగా వీరిద్దరు మద్యాన్ని కల్తీ చేసి విక్రయిస్తున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. తనిఖీల్లో ఎస్‌ఐ రవి, సిబ్బంది పాల్గొన్నారు.
బ్రాండెడ్ బాటిళ్లలో చీప్‌లిక్కర్
రూ.50 వేల మద్యం పట్టివేత
ఇద్దరి రిమాండ్