
మావో అగ్రనేతపై అరెస్ట్ వారెంట్
మంథనిరూరల్: సీపీఐ(ఎంఎల్) మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లా రాజిరెడ్డి ఉరఫ్ సత్తన్నకు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా సెషన్స్ కోర్డు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్‌పూర్ పరిధిలోని మల్లా రాజిరెడ్డి స్వగ్రామం శాస్త్రులపల్లిలోని ఆయన ఇంటికి కాంకేర్ పోలీస్‌స్టేషన్ ఓస్సై ఆర్‌కే సేతీయ, కానిస్టేబుల్ మనోహర్ స్థానిక పోలీసులతో కలిసి బుధవారం నోటీసు అంటించారు. రాజిరెడ్డి ఉరఫ్ సత్తన్న ఉరఫ్ మురళి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కోర్డు వారెంట్ జారీచేసిందని, ఆయన ఇంటికి వెళ్తే ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఇంటి తలుపులపై నోటీసు అంటించామని పోలీసులు తెలిపారు. రాజిరెడ్డిపై కాంకేర్ జిల్లా పరిధిలో క్రైమ్ నంబర్ 09/2025 ప్రకారం బీఎస్‌ఎస్ 191(2), 191(3), 190, 109, బీఎన్‌ఎస్ 25,27, అంసెట్ 13, 38(2), 39(2) యూఏపీఏ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని పోలీసులు వివరించారు. వచ్చేనెల 11వ తేదీన కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా, మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి
మల్లా రాజిరెడ్డి ఇంటికి నోటీసు అంటించిన పోలీసులు