
కళలను ప్రోత్సహించడం హర్షణీయం
పిల్లలకు చదువుతో పాటు, వివిధ కళలను నేర్పించడం హర్షణీయం. చిన్నతనం నుంచి సంగీతం నేర్చుకోవడం ద్వారా దేశ సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయి. సంగీతంతో మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పాఠశాలలకు విస్తరించడం స్వాగతిస్తున్నాం.
– చెన్నాడి వెంకటరమణరావు, కవి
ప్రతిభను వెలికితీసేలా
ప్రభుత్వ పాఠశాలల్లో సంగీతం నేర్పించడం ద్వారా వారిలో ప్రతిభను వెలికితీసే అవకాశం ఉంటుంది. బోధనతో అలసటకు గురయ్యే పిల్లలు సంగీతంతో మరింత ఉత్సాహంగా ఉంటారు. ప్రస్తుతం అనేక పాఠశాలల్లో టీచర్లు పాఠాలను కథలు, గేయాల రూపంలో చెబుతూ తోడ్పాటు అందిస్తున్నారు.
– రవి, ప్రిన్సిపల్, గొల్లపల్లి మోడల్‌స్కూల్
పరికరాలు వచ్చాయి
పీఎంశ్రీ పథకం కింద జిల్లాలోని ఎంపిక చేయబడిన పాఠశాలలకు మొదటి విడత కింద సంగీత పరికరాలను పంపిణీ చేశారు. దీనికి సంబంధించి ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పిస్తున్నాం. వారానికో పీరియడ్ సంగీతం, వాయిద్యాలపై శిక్షణ ఇచ్చేందుకు టైంటేబుల్ ఏర్పాటు చేస్తున్నాం.
– రాము, డీఈవో

కళలను ప్రోత్సహించడం హర్షణీయం

కళలను ప్రోత్సహించడం హర్షణీయం