
సోలార్ విద్యుత్ సబ్సిడీని వినియోగించుకోండి
● ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ సుదర్శనం
మెట్‌పల్లి: సోలార్ విద్యుత్‌కు అవసరమైన పరికరాలను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ సుదర్శనం తెలిపారు. సోలార్ ఇంధన వనరుల ఆవశ్యకతపై మంగళవారం ని ర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. థర్మల్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి జరుగుతోందని, తద్వారా వాతావరణ సమతుల్యత దెబ్బతినడంతోపాటు మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా హరిత ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కేంద్రం పీఎం సూర్యఘర్ యోజన, పీఎం కుసుమ్ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. దీనికింద సోలార్ పరికరాలను సబ్సిడీపై అందిస్తోందన్నారు. ఈ సందర్భంగా వినియోగదారులు వెలి బుచ్చిన పలు సందేహాలను కంపెనీ ప్రతినిధి బండి ప్రవీణ్ నివృత్తి చేశారు. డీఈ మధుసూదన్, ఏడీఏ మనోహర్ తదితరులున్నారు.