లీకేజీలను అరికట్టాలి
జిల్లా కేంద్రంలో అత్యధిక చోట్ల లీకేజీలు అవుతున్నాయి. పాతబస్టాండ్, తహసీల్ చౌరస్తాలో లీకేజీలతో వాహనాలు కూడా వెళ్లలేని స్థితిలో నీరు రోడ్లపై పారుతోంది. ప్రధానమైన ప్రాంతాల్లో వెంటనే మరమ్మతు చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది.
– కిరణ్, జగిత్యాల
వాహనదారులకు ఇబ్బంది
లీకేజీలతో నీరంతా రోడ్లపైకి వస్తుండడంతో ద్విచక్రవాహనదా రులు ప్రమాదాల బారిన పడుతున్నారు. మున్సిపల్ అధికారులు లీ కేజీలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలి. ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్లపై నీరు నిలిస్తే వాహనాలు అదుపుతప్పి పడిపోతున్నాయి. – మదన్‌మోహన్, జగిత్యాల
చర్యలు తీసుకుంటున్నాం
చాలా చోట్ల మరమ్మతు చేయిస్తున్నాం. పైప్‌లైన్లు పాతవి కావడంతో కొంత ఇబ్బందికరంగా ఉంది. అమృత్ పథకం కింద మున్సిపాలిటీ పరిధిలో కొత్త పైప్‌లైన్లు వేస్తున్నాం. ఇప్పటికే చాలాచోట్ల లీకేజీలను అరికట్టాం. ప్రజలకు శుద్ధ జలం అందించేందుకు కృషి చేస్తున్నాం.
– చరణ్, మున్సిపల్ ఏఈ
లీకేజీలను అరికట్టాలి


