ఆకతాయిలకు ముకుతాడు | - | Sakshi
Sakshi News home page

ఆకతాయిలకు ముకుతాడు

Dec 27 2025 7:47 AM | Updated on Dec 27 2025 7:47 AM

ఆకతాయ

ఆకతాయిలకు ముకుతాడు

● మహిళల భద్రతకు షీ టీంలు ● ఊరూరా అవగాహన కార్యక్రమాలు ● వేధింపులపై ఫిర్యాదు చేస్తే సత్వరమే చర్యలు

జగిత్యాలక్రైం: జిల్లాలో కళాశాలలు, పాఠశాలల్లో చదివే విద్యార్థినులు, మహిళలకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీంలు ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్టు వేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా షీటీంలు జనసంచారం ఉన్న చోట మఫ్టీలో తిరుగుతూ ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నాయి. రద్దీ ప్రాంతాలు, బస్టాండ్లు, విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో మఫ్టీలో కాపుకాస్తున్నారు. జగిత్యాల, మెట్‌పల్లి సబ్‌ డివిజన్ల పరిధిలో షీటీం బృందాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అవగాహన సదస్సు

జిల్లావ్యాప్తంగా షీటీం ఇప్పటి వరకు 115 అవగాహన సదస్సులు నిర్వహించారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 64 ఫిర్యాదులు రాగా 77 కేసులు నమోదు చేశారు. ఈ పెట్టి కేసులు 41 నమోదు చేశారు. రెడ్‌హ్యాండెడ్‌గా 178 మందిని పట్టుకుని 157 మందికి కౌన్సెలింగ్‌ నిర్వహించి, మిగతా వారిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ పెద్ద పట్టణాలతో పాటు, మండల కేంద్రాల్లోని బస్టాండ్‌ కళాశాలలు, పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

భద్రతకు ప్రాధాన్యం

మహిళలు, విద్యార్థుల రక్షణకు షీటీం బృందాలు నిరంతరం కృషిచేస్తున్నాయి. తమకు వచ్చిన ఫిర్యాదులను స్వీకరిస్తూ ఆకతాయిల ఆగడాలను వీడియో రికార్డ్‌ చేయడంతో పాటు కొన్ని సందర్భాల్లో కేసులు సైతం నమోదు చేస్తున్నారు. జగిత్యాల, మెట్‌పల్లి పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో 20 మండలాల్లో షీ టీం బృందాలు పనిచేస్తున్నాయి. టీంను ఎస్సైస్థాయి అధికారి సమన్వయం చేస్తుండగా.. మహిళా కానిస్టేబుళ్లు విధుల్లో ఉంటారు.

సమాచారం గోప్యం

ఆకతాయిలు వేధిస్తే వెంటనే షీటీంకు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతున్నా రు. జిల్లాలో ఆకతాయిలు ఎక్కువగా సంచరించే 185 ప్రాంతాలను గుర్తించారు. జిల్లావ్యాప్తంగా షీ టీం బృందాలు 115 పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సు నిర్వహించగా 9,600 మంది వి ద్యార్థులు హాజరయ్యారు. అసభ్యకరంగా ప్రవర్తిస్తే డయల్‌ 100 లేదా 87126 70783కు వాట్సప్‌ నంబ ర్‌లో సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు.

బస్టాండ్‌, పాఠశాలలు, కళాశాలలు వద్ద మహిళలను వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. జగిత్యాల సబ్‌ డివిజన్‌ పరిధిలోని పోలీసుస్టేషన్లలో మహిళల రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పాఠశాలలు, కళాశాలల వద్ద షీటీం ఫోన్‌ నంబర్లు తెలిసేలా ఏర్పాటు చేశాం. ఆకతాయిల వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు నిర్భయంగా ముందుకు రావాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.

– అశోక్‌కుమార్‌, ఎస్పీ

ఆకతాయిలకు ముకుతాడు1
1/2

ఆకతాయిలకు ముకుతాడు

ఆకతాయిలకు ముకుతాడు2
2/2

ఆకతాయిలకు ముకుతాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement