అంజన్న ఆదాయం రూ.1.51కోట్లు
మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయంలో ఈనెల 20 నుంచి 22వరకు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు అన్ని శాఖల సమన్వయం, సహకారంతో విజయవంతమయ్యాయని ఆలయ ఈఓ శ్రీకాంత్‌రావు తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాలతో మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించామని పేర్కొన్నారు. స్వామివారికి లడ్డూ ప్రసాదం ద్వారా రూ.79,14,200, పులిహోర ద్వారా రూ.10,45,920, దీక్ష విరమణల ద్వారా రూ.30,56,100, కేశ ఖండనం ద్వారా రూ.8,51,450, శీఘ్ర దర్శనం ద్వారా రూ.23,04,800 మొత్తం రూ.1,51,72,470 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.
సౌదీలో తెలుగు సంఘం ఏర్పాటు
జగిత్యాలరూరల్: సౌదీ అరేబి యాలో తెలుగు అసోసియేషన్ ఫౌండర్ మల్లేశ్ ఆధ్వర్యంలో సాటా రియాద్ చాప్టర్ కోర్ టీంను శనివారం ప్రకటించారు. అధ్యక్షుడిగా మచ్చ శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్‌గా నూర్ మహమ్మద్, ఇంజినీరింగ్ ప్రెసిడెంట్‌గా సింగు నరేష్‌కుమార్, బిజినెస్ ప్రెసిడెంట్‌గా వీరవెల్లి యోగేశ్వరా రావు, టీచర్స్ ప్రెసిడెంట్‌గా మురళిని ఎన్నుకున్నా రు. శ్రీనివాస్ మాట్లాడుతూ కులం, మతం బేధం లేకుండా అందరం కలిసి కష్టాల్లో ఉన్న తెలుగువారికి సహాయం చేద్దామన్నారు. కోర్ టీమ్ శహబా జ్, మిధున సురేష్, ముదిగొండ శంకర్, నయీమ్, అయాజ్, ముజామిలోద్దీన్, ఇలియాస్, కోకిల, మంజూష మహేశ్‌కు అభినందనలు తెలిపారు.
ఏటీఎం కార్డు దొంగిలించి రూ.92,500 విత్ డ్రా
సారంగాపూర్: ఇంట్లోంచి ఏటీఎం కార్డు దొంగిలించి రూ.92,500 విత్‌డ్రా చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొహిబి షన్ ఎస్సై రాజు కథనం ప్రకారం.. నర్సింహులప ల్లెకు చెందిన మెరుగు సత్తయ్య షాపు నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎం కార్డు దొంగిలించాడు. మా ర్చి నుంచి ఈనెల వరకు పలుమార్లు రూ.92,500 డ్రా చేసుకున్నాడు. సత్తయ్య ఇటీవల బ్యాంక్‌కు వెళ్లి అకౌంట్ పరిశీలించగా.. ఖాతా నుంచి డబ్బులు డ్రా అయినట్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేశాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
వృద్ధుడిపై పోక్సో కేసు
మెట్‌పల్లి: పట్టణానికి చెందిన ఓ బాలికపై లైంగిక దాడికి యత్నించిన వృద్ధుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక (7) గురువారం ఇంటి వద్ద ఆడుకుంటుండగా పొరుగున ఉండే వృద్ధు డు (70) తన ఇంట్లోకి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడుతుండగా బాలిక కేకలు వేసింది. బాలిక నానమ్మ, కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.


