
రాజ్యాంగ విలువలపై అవగాహన పెరగాలి
● ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి/పెగడపల్లి: బీఆర్.అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వవిప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు. ధర్మపురి మండలంలోని దమ్మన్నపేట నుంచి రాజారం వరకు శుక్రవారం జై బాపు–జై భీమ్–జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా విప్ అడ్లూరి మాట్లాడుతూ.. రాజ్యాంగ అమలు ఆవశ్యకతను వివరించేందుకు ఈ పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. పీసీసీ సభ్యు డు ఎస్.దినేశ్, నాయకులు వేముల రాజు, చిలు ముల లక్ష్మణ్, చీపిరిశెట్టి రాజేశ్, కుంట సుధాకర్, సింహరాజు ప్రసాద్, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
జగిత్యాల: అంగన్‌వాడీ కేంద్రంలోని సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో మహిళ అభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పోషణ పక్షం, పోషణ జాతర, చిన్నారుల గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ లత, సంక్షేమాధికారి నరేశ్, సీడీపీవోలు మమత, వాణిశ్రీ, వీరలక్ష్మి, మణెమ్మ పాల్గొన్నారు.
సర్కారు బడులను బలోపేతం చేస్తాం
సర్కారు బడులను బలోపేతం చేస్తామని ప్రభు త్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు. పెగడపల్లి మండలం గొల్ల పల్లె, నామాపూర్‌లో ప్రభుత్వ పాఠశాలల వార్షి కోత్సవ వేడుకలకు డీఈవో రాముతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటుకు ధీటుగా నాణ్యమైన విద్య అందుతోందన్నారు. ఎంఈవో సులోచన, ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, వైస్ చైర్మన్ సత్తిరెడ్డి, హెచ్‌ఎంలు శంకరయ్య, అనిల్‌రెడ్డి పాల్గొన్నారు.