వైభవంగా భీమేశ్వరస్వామి రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా భీమేశ్వరస్వామి రథోత్సవం

Apr 15 2025 12:15 AM | Updated on Apr 15 2025 12:15 AM

వైభవం

వైభవంగా భీమేశ్వరస్వామి రథోత్సవం

జగిత్యాలరూరల్‌: జగిత్యాల రూరల్‌ మండలం పొరండ్లలోని శ్రీభీమేశ్వరస్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామివారికి రథోత్సవ నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి శోభాయాత్ర చేపట్టారు. అక్కడ పూజలు చేసి ఆలయానికి తీసుకువచ్చారు. అలాగే హన్మాజీపేటలోని ఆదిపెద్దమ్మతల్లి రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

విద్యాహక్కు చట్టం అమలు చేయాలి

జగిత్యాలటౌన్‌: విద్యాహక్కు చట్టం– 2009 ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించాలని, ప్రైవేట్‌ పాఠశాలల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందించాలని మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. పౌరులందరికీ కులం, మతానికి అతీతంగా విద్యాబోధన అందాలనే సంకల్పంతో అంబేడ్కర్‌ ప్రాథమిక హక్కుల జాబితాలో విద్యను చేర్చారని పేర్కొన్నారు. విప్‌ అంటే మంత్రితో సమానమని, విద్య ఆవశ్యకతను సీఎం దృష్టికి తీసుకెళ్లి అమలయ్యేలా చూడాలని కోరారు. వేదికపై ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు బండ శంకర్‌ తదితరులు ఉన్నారు.

వైభవంగా    భీమేశ్వరస్వామి రథోత్సవం1
1/1

వైభవంగా భీమేశ్వరస్వామి రథోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement