నిరుపేదలందరికీ సన్నబియ్యం
రాయికల్: నిరుపేదలకు సన్నబియ్యం అందిస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ అని మాజీమంత్రి జీవన్ రెడ్డి అన్నారు. రాయికల్‌లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఎన్నికల హామీ మేరకు సన్నరకం ధాన్యం పండించే రైతులకు క్వింటాలుకు రూ.500బోనస్ అందిస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో హామీ ఇచ్చినా సన్నబియ్యం పథకాన్ని అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. రాయికల్ ప్రజలు తనను ఆదరించారని, వారి సహకారంతోనే తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పటి సీఎం కేసీఆర్‌తో మాట్లాడి బోర్నపల్లికి బ్రిడ్జి మంజూరు చేయించానని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పట్టణంలో ఫిల్టర్ బెడ్ మరమ్మతుకు రూ.14 కోట్లు మంజూరు చేయించానన్నారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజిరెడ్డి, మహిళా అధ్యక్షురాలు తాటిపాముల మమత, హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ దాసరి గంగాధర్, యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, జిల్లా నాయకులు షాకీర్, రాకేష్, దివాకర్‌రెడ్డి, మసూద్, మోబీన్, బోంగిని భూమాగౌడ్ పాల్గొన్నారు.


