సారంగాపూర్: కుష్ఠువ్యాధి నిర్మూలనకు ప్రజలు సహకరించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీని వాస్ అన్నారు. బీర్‌పూర్ మండలం నర్సింహులపల్లెలో లెప్రసీ (ఎల్‌సీడీసీ)పై వైద్యసిబ్బంది సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. వ్యాధి లక్షణాలను వివరించారు. శరీరం స్పర్శలేకుండా రాగి రంగులో, ఎర్రబారిన రంగులో మచ్చలు ఉంటే ఏడాదిపాటు మందులు వాడాలని సూచించారు. ఐదు మచ్చల కంటే తక్కువగా ఉంటే ఆరు నెలలు మందులు వాడాలని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులను అందుబాటులో ఉంచుతున్నామని, వైద్యులు సలహాలు పాటిస్తూ, మందులు తీసుకోవాలన్నారు. లెప్రసీ బాధితులను పకడ్బందీగా గుర్తించాలని సూచించారు. ఆయన వెంట సీహెచ్‌వో కుద్ధుస్, సూపర్‌వైజర్లు శ్రీనివాస్, కిశోర్, ఏఎన్‌ఎంలు ఉన్నారు.