గెలుస్తడు కాస్కో.. మెజారిటీ రాసుకో.. | - | Sakshi
Sakshi News home page

గెలుస్తడు కాస్కో.. మెజారిటీ రాసుకో..

Dec 3 2023 12:52 AM | Updated on Dec 3 2023 12:52 AM

● ఎగ్జిట్‌ పోల్స్‌తో గెలుపోటములపై జోరుగా చర్చలు ● ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయనేదానిపై ఆరా ● కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారా? ● కాంగ్రెస్‌ వస్తే సీఎం ఎవరు? అనేదానిపై పందేలు

సాక్షి, పెద్దపల్లి: ‘రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమవుతాయా? కాంగ్రెస్‌ సీట్లు గెలుస్తుందా? బీఆర్‌ఎస్‌యే అధికారంలోకి వస్తుంది కాస్కో అంటే.. కాంగ్రెస్‌ మెజార్టీ రాసుకో’ అంటూ జిల్లాలో అసెంబ్లీ ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. స్థానిక అభ్యర్థుల కంటే రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే దానిపై చర్చ జరుగుతోంది. ఆదివారంతో ఎవరు అధికారాన్ని చేపట్టబోతున్నారనే అంశంపై స్పష్టత రానుండటంతో ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎగ్జిట్‌ పోల్స్‌తో..

గురువారం విడుదలైన ఎగ్జిట్‌పోల్స్‌ మరింత ఉత్కంఠ తెచ్చిపెట్టాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అనుకూలంగా రాగా, బీఆర్‌ఎస్‌ శ్రేణులు మాత్రం తుది ఫలితం తమకే అనుకూలంగా వస్తుందని ధీమా వ్య క్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామాల్లోనూ ఏ నలుగురు కలిసినా కేసీఆర్‌ మళ్లీ వస్తారా? కాంగ్రెస్‌ అధికారం చేపట్టేలా ఫుల్‌ మెజార్టీ వస్తుందా? మెజార్టీ వస్తే సీఎం ఎవరు? అంటూ లెక్కలు వేస్తూ సరాదాగా పందేలు కాస్తున్నారు.

పందాలు పలురకాలు..

క్రికెట్‌లో ఎలాగైతే టాస్‌ ఎవరూ గెలుస్తారు నుంచి ఏ బాల్‌కు సిక్స్‌, ఫోర్‌ కొడుతారు లాంటి అంశాల పై బెట్టింగ్‌ కాచేవారు. ఇప్పుడు దాదాపు అన్ని సర్వేల్లో కాంగ్రెస్‌కు గరిష్టంగా 75స్థానాలు వస్తాయని చెప్పాయి. దీంతో అధికార పార్టీ గెలిచే మిగిలిన స్థా నాలు ఏమిటి? బీజేపీ, బీఎస్పీల అభ్యర్థులు గెలిచే నియోజవర్గాలు ఏమిటి? అనే అంశాలపై పందేలు కాస్తున్నారు. ఎగ్జిట్‌ఫోల్స్‌ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండటంతో ఆ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. ఆదివారం వెల్లడికానున్న ఫలితాలతో అదృష్టం ఎవరిని వరించనుందో తేలిపోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement