సీపీఐది వందేళ్ల త్యాగాల చరిత్ర
కరీంనగర్‌టౌన్: సీపీఐ ప్రజల పక్షాన పోరాటం చేస్తోందని పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్‌లో ఆదివారం నిర్వహించిన పార్టీ శతవసంతాల ముగింపు ఉత్సవాలకు హాజరయ్యారు. ముందుగా సర్కస్‌గ్రౌండ్ నుంచి రెవెన్యూగార్డెన్ వరకు భారీ ర్యాలీ తీశారు. రెవెన్యూ గార్డెన్‌లో జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సభలో పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ సీపీఐ డిసెంబర్ 26తో వందేళ్లు పూర్తి చేసుకుందన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ నాయకులు స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములయ్యారన్నారు. భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి కార్యక్రమాలు సీపీఐ పోరాటాల ఫలితంగానే అమలయ్యాయన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ పాత్ర గొప్పదన్నారు. 3,500 గ్రామాల విముక్తి, 4500మంది ప్రాణాలను త్యాగం చేసిన చరిత్ర సీపీఐదన్నారు. రాబోయే పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ సంఖ్యలో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర సహాయకార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేణ శంకర్, పెద్దపల్లి జిల్లా కార్యదర్శి సదానందం, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసింహ, డీహెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనిల్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు అందెస్వామి, పొన్నగంటి కేదారి, శంకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, కోయడ సృజన్‌కుమార్, బోయిని అశోక్ పాల్గొన్నారు.
పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి
సీపీఐది వందేళ్ల త్యాగాల చరిత్ర


