కుట్టుమిషన్‌తో ఉపాధి
మాది కోనరావుపేట మండలం మామిడిపల్లి. నేను నాగారంలో ఏర్పాటు చేసిన జీఎమ్మార్ శిక్షణ కేంద్రంలో కుట్లు, అల్లికల్లో శిక్షణ పొందాను. రెండు నెలల శిక్షణ పొందిన తర్వాత మా గ్రామంలోనే స్వయం ఉపాధి పొందుతున్నాను. నాగారంలో అన్ని రకాల అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. మహిళలకు ఉపయోగకరంగా ఉంది.
– ప్రవళిక, మామిడిపల్లి(కోనరావుపేట)
నాణ్యమైన శిక్షణ అందిస్తున్నాం
నాగారంలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసినప్పటి నుంచి వివిధ వృత్తిపరమైన శిక్షణలు అందిస్తున్నాం. చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా యువకులు వచ్చి వివిధ అంశాలను నేర్చుకుంటున్నారు. వచ్చిన వారందరికీ నాణ్యమైన శిక్షణతోపాటు ఉచిత భోజనం, వసతి కల్పిస్తున్నాం. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న యువకులకు తగిన ఉపాధి కూడా కల్పిస్తున్నాం.
– ఎం.మహేశ్, సెంటర్ ఇన్‌చార్జి
కుట్టుమిషన్‌తో ఉపాధి


