కువైట్‌లో కనగర్తివాసి మృతి
కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన మారుపాక నర్సయ్య(55) కువైట్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన మారుపాక నర్సయ్య గత 15 ఏళ్లుగా ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లి, వస్తున్నాడు. కొంతకాలంగా కరీంనగర్ శివారులోని చింతకుంటలో ఉంటున్నాడు. స్వగ్రామానికి వచ్చేందుకు అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఈక్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం తన గదిలో ఉండగా గుండెపోటుతో మృతిచెందాడు. నర్సయ్యకు భార్య పద్మ, కూతురు భవానీ, కుమారుడు దత్తు ఉన్నారు.


