జంప్‌ జిలానీలు..! ఉన్న నేతలు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారో? | Sakshi
Sakshi News home page

జంప్‌ జిలానీలు..! ఉన్న నేతలు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారో?

Published Sun, Nov 5 2023 12:50 AM

- - Sakshi

సాక్షి, కరీంనగర్‌/జగిత్యాల: అసెంబ్లీ ఎన్నికల వేళ పారీల్టలో ఉన్న నేతలు ఎప్పుడో ఏ పార్టీలో చేరుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఉదయం ఓ పార్టీ.. సాయంత్రం మరో పార్టీలో చేరిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని గంటల వ్యవధిలోనే కొందరు నాయకులు కండువాలు మార్చుతున్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు తమవైపు తిప్పుకొని కండువాలు కప్పే కార్యక్రమాన్ని పనిగా పెట్టుకుంటున్నాయి. నెలలో అధికార పార్టీ నాయకులు ఎంతోమందిని బీఆర్‌ఎస్‌లోకి చేర్చుకున్నారు. జిల్లాలోని కోరుట్ల, ధర్మపురి, జగిత్యాలలో ఎక్కువగా పార్టీలు మారుతున్నారు. ప్రస్తుతం శాసన సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్న ప్రధాన పార్టీల్లోకి పలువురు నేతలు మారడం చర్చనీయాంశమైంది.

నేతల కదలికలపై ఆరా..
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమపార్టీ నేతలు ఎవరిని కలుస్తున్నారు, ఎటు వెళ్తున్నారన్న దానిపై ఆయాపార్టీల నాయకులు తెలుసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, మండల, నియోజకవర్గ నేతలకు అందుబాటులో ఉండకపోవడం వంటి వాటిపై ఆరా తీస్తున్నారు. పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా? దేనిౖపైనెనా అసంతృప్తితో ఉన్నారా? అన్నదానిపై అనచరుల ద్వారా తెలసుకుంటన్నారు.

కార్యకర్తల నుంచి కీలక నేతల వరకు..
జిల్లాలోని కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఇటీవల జోరుగా కండువాలు మార్చుతుండటంతో జిల్లాలో జంపింగ్‌ పాలిటిక్స్‌ జోరందుకున్నాయి. సాధారణ కార్యకర్తలు మొదలుకొని కీలక నేతల దాకా పార్టీలు మారుతున్నారు. పార్టీలో ఉన్నవారిని కాపాడుకోవ డం కోసం ఇతర పార్టీలకు గాలం వేయడం, పార్టీ వీడినవారిని మళ్లీ సొంతగూటికి ఆహ్వానించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. పార్టీలో చేరినవారితో పాటు పాతవారికి కండువాలు కప్పిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేస్తూ నియోజకవర్గ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు.

బీజేపీలో..
మొదటి రెండు జాబితాల్లో అభ్యర్థుల పేర్లను అధిష్టానం ప్రకటించడంతో బీజేపీ ప్రచారం కాస్త వెనుకబడింది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ముందే ప్రకటించడంతో రెండు పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. బీజేపీ అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించడంతో కార్యకర్తలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో కమలం పార్టీలో స్తబ్ధత నెలకొంది.

ఆశ చూపుతూ.. మద్దతు కూడగట్టుకుంటూ..
గత సార్వత్రిక, స్థానిక ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన వారితో పాటు ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా ఉన్నవారితో మళ్లీ లబ్ధిపొందవచ్చనే ఉద్దేశంతో పార్టీలు మారేలా రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జంపింగ్‌లు ఎక్కువకావడంతో ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారింది. కొన్నేళ్లుగా పార్టీకి దూరంగా ఉన్నా పట్టించుకోని పార్టీల నాయకులు ఇప్పుడు వారి ఇళ్లకు వెళ్లి కలుస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పదవులు ఇప్పిస్తామని ఆశచూపుతూ మద్దతు కూడగట్టుకుంటున్నారు.
ఇవి చదవండి: ఇద్దరు పోలీసు అధికారులు.. హవాలా వ్యాపారితో కుమ్మక్కై.. ఏకంగా..

Advertisement
 
Advertisement