బర్త్‌డే పార్టీ కోసం వెళ్లి.. విషాదం! | - | Sakshi
Sakshi News home page

బర్త్‌డే పార్టీ కోసం వెళ్లి.. విషాదం!

Oct 9 2023 1:32 AM | Updated on Oct 9 2023 12:04 PM

- - Sakshi

గల్లంతైన ధర్మతేజ

జగిత్యాల: ఎన్టీపీసీకి చెందిన ఐదుగురు యువకులు బర్త్‌ డే పార్టీ కోసం సరదాగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చి మద్యంతో వేడుకలు జరుపుకోగా కొద్ది సేపట్లోనే సరదా కాస్త విషాదంగా మారింది. అంతర్గాం ఎస్సై సంతోష్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. ఎన్టీపీసీకి చెందిన ఐదుగురు యువకులు బర్త్‌డే పార్టీ పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం కారులో మద్యం బాటిళ్లతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకున్నారు.

ఐదుగురు యువకులు అధికంగా మద్యం సేవించి ప్రాజెక్టులో స్నానం చేసేందుకు నదిలోకి దిగారు. అందులో ఎవరికీ ఈత రాదు. ముగ్గురు వ్యక్తులు ఒడ్డుకు దగ్గరగా స్నానం చేస్తుండగా, ఇద్దరు వ్యక్తులు కొంచెం దూరంగా నీటిలోకి వెళ్లి సరదాగా గంతులేస్తూ స్నానం చేస్తుండగా కనకమేడల ధర్మతేజ(32) నీటిలో మునిగి కనిపించకపోయాడు. కొంతసేపు పరిశీలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. మిగతా నలుగురు వ్యక్తులు ఒడ్డుకు చేరారు. కాగా అప్పటికే చీకటి పడడంతో మరుసటి రోజు గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement