ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో యుద్ధం, దేశంలో శీతాకాల పరిస్థితులు తదితర కారణాల రీత్యా దేశంలో ఇందన రంగంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రకటించారు.
2022లో రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ ఎనర్జీ సెక్టార్ తీవ్రంగా దెబ్బతింది. రష్యా జరిపిన దాడులలో ఉక్రెయిన్ విద్యుత్ ప్లాంట్‌లు పెద్దమెుత్తంలో దెబ్బత్నిన్నాయి. అంతేకాకుండా అత్యధిక శాతం చమురు యుద్ధానికి అవసరం అవడంతో ఆదేశంలో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడింది. దీంతో శీతాకాలంలో ఆ దేశంలో పెద్ద ఎత్తున కరెంట్ కోతలతో పాటు నీటి సరఫరాలకు అంతరాయం తదితరమైనవి ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆదేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
దేశంలో ఇందన ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో నెలకొన్న ఎమర్జెన్సీ పరిస్థితులను పరిష్కరించడానికి, సరఫరా అంతరాయాలను పరిష్కరించడానికి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆ కార్యాలయం 24 గంటలూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలకు అత్యంత కీలకమైన సేవలను తిరిగి పునరుద్ధరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జెలెన్‌స్కీ ఆదేశించారు.


