ప్రపంచంలోనే తొలి పోస్టల్‌ స్టాంప్‌ వేలానికి | Worlds First Mail Sent Using Stamp To Be Auctioned | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే తొలి పోస్టల్‌ స్టాంప్‌ వేలానికి

Jan 13 2024 7:20 AM | Updated on Jan 13 2024 7:49 AM

Worlds First Mail Sent Using Stamp To Be Auctioned - Sakshi

సాక్షి, నేషనల్‌ డెస్క్‌... ప్రపంచంలోనే మొదటిదని భావిస్తున్న 180 ఏళ్ల నాటి పోస్టల్‌ స్టాంప్‌ వేలానికి వచ్చింది. ఒక పెన్నీ ముఖ విలువతో కూడిన దీనికి దాదాపు రూ.20 కోట్ల (25 లక్షల డాలర్ల) దాకా పలకవచ్చని భావిస్తున్నారు. 1850 మే 2 నాటి తేదీ ఉన్న ఈ నల్లరంగు స్టాంప్‌ను పెన్నీ బ్లాక్‌ స్టాంప్‌గా పిలుస్తారు. ఇంగ్లండ్‌లో బెడ్లింగ్టన్‌ పట్టణానికి చెందిన విలియం బ్లెంకిన్‌స్లోప్‌ అనే వ్యక్తికి అక్కడికి 300 మైళ్ల దూరంలోని లండన్‌ నుంచి పంపిన లెటర్‌పై దీన్ని అంటించారు. ఇలా స్టాంపులంటించడం ద్వారా పోస్టేజీ చార్జీలను ముందుగానే చెల్లించే పద్ధతి అప్పటిదాకా ఉండేది కాదు.

లెటర్లను అందుకునే వాళ్లే పోస్ట్‌మాన్‌కు పోస్టేజ్‌ రుసుము చెల్లించేవాళ్లు. వాళ్లు గనక లెటర్లను తీసుకునేందుకు నిరాకరిస్తే పోస్టల్‌ శాఖకు నష్టమే మిగిలేది. దీనికి చెక్‌ పెట్టేందుకు సర్‌ రోలాండ్‌ హిల్‌ ఈ పెన్నీ బ్లాక్‌ పోస్టల్‌ స్టాంప్‌ను రూపొందించాడు. ప్రఖ్యాత వేలం సంస్థ సోత్‌బీ ఫిబ్రవరిలో దీన్ని వేలం వేయనుంది. ప్రపంచ సమాచార వ్యవస్థలోనే విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఈ పోస్టల్‌ స్టాంప్‌ వేలానికి రావడం ఎంతో ఎక్సైటింగ్‌గా ఉందని సోత్‌బీ గ్లోబల్‌ హెడ్‌ రిచర్డ్‌ ఆస్టిన్‌ అన్నారు.

చదవండి: లండన్‌ మేయర్‌ ఎన్నికల బరిలో  ఇద్దరు భారత సంతతి వ్యాపారవేత్తలు
                

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement