ట్రంప్‌ కేబినెట్‌ మీటింగ్‌లో రచ్చ.. రచ్చ! | What Trump Says Marco Rubio Elon Musk Clash Cabinet Meet | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ కేబినెట్‌ మీటింగ్‌లో రచ్చ.. రచ్చ!

Published Sat, Mar 8 2025 7:55 AM | Last Updated on Sat, Mar 8 2025 1:32 PM

What Trump Says Marco Rubio Elon Musk Clash Cabinet Meet

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షతన జరిగిన తాజా కేబినెట్‌ సమావేశం రసాభాసా చోటు చేసుకుంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో(Marco Rubio), వైట్‌హౌజ్‌ సలహాదారు ఇలాన్‌ మస్క్‌లు ట్రంప్‌ సమక్షంలోనే వాగ్వాదానికి దిగారు.

స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌లలో ఉద్యోగులను తొలగించకపోవడాన్ని ప్రస్తావించిన మస్క్‌.. రుబియోపై చిందులు తొక్కారు. ట్రంప్‌ ఏరికోరి నియమించుకున్న వ్యక్తి.. కేవలం టీవీల్లో కనిపించడంపైనే దృష్టిసారిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. అయితే..  అబద్ధాలు చెబుతున్నారంటూ మస్క్ మొహం మీదే రుబియో కౌంటర్లు ఇచ్చారు.

స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి 1,500 మంది ఉద్యోగులను ఇప్పటికే తొలగించామని(Layoffs). ఒకవేళ వాళ్లందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుని మరి తొలగించాలని మస్క్‌ భావిస్తున్నారేమోనని వెటకారంగా సమాధానం ఇచ్చారు. దీంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఒకానొక టైంలో.. ట్రంప్‌ రుబియోకి మద్ధతుగా నిలిచినట్లు సమాచారం. ఇక.. 

ఈ కేబినెట్‌ సమావేశంలో పాల్గొన్న అధికారులంతా మస్క్‌పై ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. మస్క్‌ చర్యలతో రిపబ్లికన్లలోనూ అసహనం పెరిగిపోతోందని.. ఈ క్రమంలోనే వైట్‌హౌజ్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని చీఫ్ స్టాఫ్‌ సుసీ వైల్స్ మీటింగ్‌లో ప్రస్తావించారు. ఈ  మేరకు‌‌ గురువారం కేబినెట్‌ మీటింగ్‌లో జరిగిన అంశాలన్నింటిని ప్రస్తావిస్తూ న్యూయార్క్‌ టైమ్స్ ఓ కథనం ఇచ్చింది. అయితే..

అలాంటిదేం లేదు
కేబినెట్‌ మీటింగ్ హాట్‌ హాట్‌గా సాగిందన్న మీడియా కథనాన్ని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) ఖండించారు. శుక్రవారం ఓవెల్‌ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘నేను అక్కడే ఉన్నా కదా. అక్కడ ఎలాంటి ఘర్షణ జరలేదు. మీరే(మీడియాను ఉద్దేశించి..) లేనిపోనివి సృష్టిస్తున్నారు. ఇలాన్‌, మార్కో ఇద్దరూ గొప్పవాళ్లే. వాళ్లు తమ విధులను అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు’’ అని ట్రంప్‌  పొగడ్తలు గుప్పించారు.

డోజ్‌ విమర్శలపై మస్క్‌
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌.. ప్రముఖ బిలియనీర్‌ ఇలాన్‌ మస్క్‌ను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ(DOGE) సారథిగా నియమించారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే ‘డోజ్‌’ ప్రాజెక్టు లక్ష్యమని, తన ప్రభుత్వంలో సమర్థత పెంచేందుకు ఈ విభాగం కృషి చేస్తుందని ఆ టైంలో ట్రంప్‌ ప్రకటించారు. ప్రభుత్వ శాఖల్లో వృథా ఖర్చులకు కత్తెర, దుబారా ఖర్చులకు కోత, అవినీతి నిర్మూలన, ఫెడరల్‌ సంస్థలను పునర్మిర్మాణం.. ఇవన్నీ డోజ్‌ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా.. ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాల తొలగింపు చేపట్టారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. 2026 జులై 4వ తేదీలోపు మొత్తం ఫెడరల్ బ్రూరోక్రసీని ఇది ప్రక్షాళన చేయాల్సి ఉంది. ఆ తర్వాత డోజ్‌ దానికదే ఎక్స్‌పైరీ కానుంది.

అయితే.. డోజ్‌ తీసుకునే తీవ్రమైన నిర్ణయాల వల్ల దేశ రక్షణ, మౌలిక సదుపాయాల కల్పన వంటి ప్రభుత్వం అందించే సేవలు నిర్వీర్యం అయ్యే అవకాశం ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక అభివృద్ధి కావాలంటే.. కొన్నింటిని వదులుకోవాలని మస్క్‌ తన చర్యలను సమర్థించుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement