రష్యా అధికారిక కార్యక్రమాల్లో పుతిన్‌ డూప్‌? క్రెమ్లిన్ ఏమంటోంది? | Kremlin Answer To Claims Vladimir Putin Uses Body Doubles | Sakshi
Sakshi News home page

Vladimir Putin Body Doubles: రష్యా అధికారిక కార్యక్రమాల్లో పుతిన్‌ డూప్‌?

Published Mon, Nov 6 2023 10:08 AM | Last Updated on Mon, Nov 6 2023 10:57 AM

Vladimir Putin Body Doubles Used Newspaper Claim Kremlin Answer - Sakshi

రష్యా పలు అధికారిక కార్యక్రమాల కోసం అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ డూప్‌ (బాడీ డబుల్స్‌)ను వినియోగిస్తున్నదంటూ సోషల్‌మీడియాలో తరచూ పలు ఊహాగానాలను షికారు చేస్తున్నాయి. అయితే వీటిని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ ఖండించింది. 

క్రెమ్లిన్‌ అధ్యక్ష ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ ఇటువంటి వాదనలను వినోదం కోసమే చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. మాస్కోలో ప్రారంభమైన రష్యా ఎగ్జిబిషన్‌లో పెస్కోవ్ మాట్లాడుతూ ‘మాకు ఉన్నది పుతిన్‌ ఒక్కరే. రష్యా అధ్యక్షుని ‘బాడీ డబుల్స్‌’ అంటూ వస్తున్న ఊహాగానాలు హాస్యాస్పదమైనవని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో ఇటువంటివి విరివిగా కనిపిస్తున్నాయని అన్నారు.  కొందరు నిపుణులు ఇంటర్నెట్‌లో పుతిన్ రూపాలను లెక్కకుమించి సృష్టిస్తున్నారని ఆరోపించారు. 

రష్యా అధ్యక్షుని బాడీ డబుల్స్‌ను పలు విదేశీ పర్యటనలతో సహా కొన్ని బహిరంగ కార్యక్రమాలకు కూడా ఉపయోగించారని ఒక వార్తాపత్రిక పేర్కొంది. అలాగే ఇటీవల జపనీస్ టీవీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ కిరిల్ బుడనోవ్ కూడా ఇదే విధమైన ప్రకటన చేశారు.

పుతిన్ ‘లుక్-అలైక్’ అంటూ వచ్చిన పలు నివేదికలు అసంబద్ధమైనవంటూ తాజాగా మరోమారు డిమిత్రి పెస్కోవ్‌ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌  మంచి ఫిట్‌నెస్ కలిగి ఉన్నారని , నాన్‌స్టాప్‌గా కూడా పని చేయగలరని ఆయన పేర్కొన్నారు. 
ఇది కూడా చదవండి: పాక్‌పై ప్రాణాంతక అమీబా దాడి.. 11 మంది మృతి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement