భూమిని ఢీ కొట్టిన జెట్‌ విమానం...మంటల్లో సైతం ఎగిరి...: వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

Viral Video: భూమిని ఢీ కొట్టిన జెట్‌ విమానం...మంటల్లో సైతం ఎగిరి...

Published Tue, Sep 20 2022 12:04 PM

Viral Video: Pilot Killed Plane Crash During Annual Air Race Competition - Sakshi

అమెరికా నెవాడాలో వార్షిక ఎయిర్‌ రేస్‌ పోటీలు జరుగుతుంటాయి. అందులో భాగంగా చివరి రోజు జరుగుతున్న ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో అనుహ్య ప్రమాదం చోటుచేసుకుంది. ఉన్నటుండి ఒక జెట్‌ విమానం ఒక్కసారిగా భూమిని ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లో సైతం విమానం ఎగురుతూ దూరంగా ఒక చోట ఆగిపోయింది.

ఈ ఘటనలో పైలెట్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా జెట్‌ విమానాలన్నీ సురక్షితంగానే ల్యాండ్‌ అయ్యాయి. ఈ భయానక ప్రమాదం కారణంగా మిగతా ఈవెంట్లన్నింటిని రద్దు చేశారు. ఐతే మిగతా పైలెట్ల ఎవరూ ప్రమాదం బారిన పడలేదని తెలిపారు. ప్రతి ఏటా సెప్టెంబర్‌లో నెవాడాలోని రెనో స్టెడ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌ రేస్‌లు జరుగుతుంటాయి.

ఈ మేరకు ఎయిర్‌ రేస్‌ల చైర్మన్‌ ఫ్రెడ్‌ టెల్లింగ్‌ మాట్లాడుతూ... నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డు(ఎన్‌టీఎస్‌బీ), ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినస్ట్రేషన్‌  ఈ ప్రమాదానికి గల కారణాలపై వివరణాత్మక దర్యాప్తును జరుపుతాయని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: వీడియో: 'ఆమె ఎవరసలు?'.. రాణి అంత్యక్రియల కవరేజ్‌పై బ్రిటన్‌ ప్రజల ఆగ్రహం)

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement