breaking news
air raids
-
భూమిని ఢీ కొట్టిన జెట్ విమానం...మంటల్లో సైతం ఎగిరి...: వీడియో వైరల్
అమెరికా నెవాడాలో వార్షిక ఎయిర్ రేస్ పోటీలు జరుగుతుంటాయి. అందులో భాగంగా చివరి రోజు జరుగుతున్న ఛాంపియన్షిప్ పోటీల్లో అనుహ్య ప్రమాదం చోటుచేసుకుంది. ఉన్నటుండి ఒక జెట్ విమానం ఒక్కసారిగా భూమిని ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లో సైతం విమానం ఎగురుతూ దూరంగా ఒక చోట ఆగిపోయింది. ఈ ఘటనలో పైలెట్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా జెట్ విమానాలన్నీ సురక్షితంగానే ల్యాండ్ అయ్యాయి. ఈ భయానక ప్రమాదం కారణంగా మిగతా ఈవెంట్లన్నింటిని రద్దు చేశారు. ఐతే మిగతా పైలెట్ల ఎవరూ ప్రమాదం బారిన పడలేదని తెలిపారు. ప్రతి ఏటా సెప్టెంబర్‌లో నెవాడాలోని రెనో స్టెడ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ రేస్‌లు జరుగుతుంటాయి. ఈ మేరకు ఎయిర్ రేస్‌ల చైర్మన్ ఫ్రెడ్ టెల్లింగ్ మాట్లాడుతూ... నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు(ఎన్టీఎస్బీ), ఫెడరల్ ఏవియేషన్ అడ్మినస్ట్రేషన్ ఈ ప్రమాదానికి గల కారణాలపై వివరణాత్మక దర్యాప్తును జరుపుతాయని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: వీడియో: 'ఆమె ఎవరసలు?'.. రాణి అంత్యక్రియల కవరేజ్‌పై బ్రిటన్ ప్రజల ఆగ్రహం) -
సిరియాలో వైమానిక దాడులు
100 మందికి పైగా ఉగ్రవాదుల హతం వాషింగ్టన్: సిరియాలో అల్‌ఖైదా శిక్షణా శిబిరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధవిమానాలు వైమానిక దాడులు నిర్వహించాయి. ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో జరిపిన ఈ దాడుల్లో దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు నేవీ కెప్టెన్ జెఫ్ డేవిస్ తెలిపారు. ఈ దాడులు బీ–52 యుద్ధ విమానంతోపాటు డ్రోన్ల సహాయంతో నిర్వహించినట్లు చెప్పారు. గురువారం నిర్వహించిన ఈ దాడుల్లో అల్‌ఖైదాకు చెందిన కీలక వ్యక్తులు మృతి చెందారని ఓ రక్షణాధికారి చెప్పారు.