ఆ మంత్రి కొడుకుతో యూఎస్‌ రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడూ ఏం జరిగిందంటే.... | Sakshi
Sakshi News home page

Viral Video: విదేశాంగ మంత్రి కొడుకుతో యూఎస్‌ రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడూ ఏం జరిగిందంటే....

Published Wed, Aug 17 2022 2:33 PM

Viral Video: External Affairs Minister Said Incident Restaurant In US - Sakshi

భారత్‌ జారి చేసే కోవిడ్‌ సర్టిఫికెట్‌లకి యూఎస్‌ జారీ చేసిన కోవిడ్‌ సర్టిఫికెట్‌లకి ఎంత తేడా ఉందో భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌  చక్కగా వివరించారు. ఈ మేరకు ఆయన తన కొడుతో కలిసి యూఎస్‌లోని రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడూ జరిగిన సంఘటన గురించి చెప్పారు. కరోన ఆంక్షల తదనంతరం 2021లో అమెరికా వెళ్లినప్పుడూ జరిగిన సంఘటన గురించి చెప్పుకొచ్చారు జై శంకర్‌.

జై శంకర్‌ తన కొడుకుతో కలిసి అమెరికాలోని ఒక రెస్టారెంట్‌కి వెళ్లారు. నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ... "అక్కడ ఆ రెస్టారెంట్‌ వాళ్లు కోవిడ్‌ సర్టిఫికెట్లు చూపించమని అడిగారు. నేను నా మొబైల్‌లొ సర్టిఫికెట్‌ని చూపిస్తే, నా కొడుకు పర్సులోంచి ఒక  సర్టిఫికెట్‌ని తీసి చూపించాడు. అప్పుడు అనిపించింది ఓహో నా దేశానికి ఇక్కడకి ఎంత వ్యత్యాసం ఉంది." అని నవ్వుతూ చెప్పారు.

ఈ మేరకు ఆయన కోవిడ్‌ సర్టిఫికేట్‌ జారీ విషయంలో భారత్‌ అభివృద్ధిని తేటతెల్లం చేసిందన్నారు. అంతేకాదు జై శంకర్‌ నాటి సంఘటనకు వివరిస్తున్న వీడియోని నెటిజన్లతో పంచుకున్నారు. ఈ వీడియోని అరుణ్‌ పుదూర్‌ అనే వ్యక్తి "విదేశాంగ మంత్రి జై శంకర్‌ తన కొడుకుతో అమెరికాలోని రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడూ ఏం జరిగిందంటే" అని ఒక క్యాప్షన్‌ జోడించి మరీ పోస్ట్‌ చేశారు. ఇప్పుడూ ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

(చదవండి: వీడియో: ప్రపంచాన్నే వణికించిన భారీ గొయ్యి.. వీడిన మిస్టరీ.. ఎలా ఏర్పడిందంటే..)

Advertisement
 
Advertisement
 
Advertisement