Viral Video: Driver Accidentally Crashes Car Into US Store - Sakshi
Sakshi News home page

Viral Video: షాపింగ్‌మాల్‌లోకి దూసుకెళ్లిన కారు.. సీసీటీవీ దృశ్యాలు వైరల్‌

May 29 2022 6:25 PM | Updated on May 29 2022 7:08 PM

Viral Video: Driver Accidentally Crashes Car Into US Store - Sakshi

వాషింగ్టన్‌: షాపింగ్‌ మాల్‌లోకి కారు దూసుకెళ్లిన ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన అమెరికాలోని టెంపే నగరంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ దృశ్యాలు సోషల్‌ మీడియాలో రికార్డయ్యాయి. ఇందులో షాపింగ్‌ మాల్‌లో ఇద్దరు ఉద్యోగులు మాట్లాడుకుంటూ ఉండగా సడెన్‌గా ఓ వైట్‌ కలర్‌  కారు మాల్‌లోకి దూసుకొచ్చినట్లు కనిపిస్తోంది.  డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని టెంపో పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ బ్రేక్‌పై కాలు వేయబోయి ఏక్సలరేటర్‌పై వేయడంతో కారు షాపింగ్‌ మాల్‌ ప్రవేశ ద్వారం నుంచి లోనికి దూసుకెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

కారు మాల్‌లోకి చొచ్చుకుపోవడంతో అక్కడ మాట్లాడుకుంటున్న ఇద్దరు ఉద్యోగులను బలంగా ఢీకొట్టింది. అలాగే షాపింగ్‌ మాల్‌లోని కొన్ని ర్యాక్‌లను కారు కారు ధ్వంసం చేసింది. గాయపడిన ఉద్యోగులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే  రిపేర్‌ కోసం కొన్ని రోజుల పాటు షాపింగ్‌ మాల్‌ను మూసివేస్తున్నట్లు యాజమాని తెలిపారు. మరోవైపు షాపింగ్‌ మాల్‌లోకి కారు దూసుకెళ్లి ఇద్దరు ఉద్యోగులను గాయపర్చిన ఈ షాకింగ్‌ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దేవుడి దయ వల్ల ఉద్యోగులకు ఏం జరగలేదని, కారు ఇంకొంచెం స్పీడ్‌గా వచ్చింటో ఏ ప్రమాదం జరిగేదోనని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.
చదవండి:  Nepal Plane Missing: నేపాల్‌లో అదృశ్యమైన విమానం ఆచూకీ గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement