వైరల్‌ : 100 ఏళ్లుగా అది ఒంటరి ఇళ్లు

Viral Photos Of Remote Island Has Been Empty For 100 Years - Sakshi

చుట్టూ సముద్రం.. మధ్యలో అందమైన ద్వీపం.. అందులో ఒకే ఒక వైట్‌హౌస్‌. అయితే వందేళ్లుగా ఆ ఇంట్లో ఎవరు ఉండడం లేదు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వైట్‌హౌస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వాస్తవానికి ఈ వైట్ హౌస్ ఐస్లాండ్‌కు దక్షిణాన ఉన్న రిమోట్ ద్వీపమైన ఎల్లియే ద్వీపంలో ఉంది. ఈ ద్వీపం ప్రస్తుతం ఎవరూ లేని  స్థలంగా మారినప్పటికీ.. 300 ఏళ్ల క్రితమే ఐదు కుటుంబాలు ఇక్కడ నివసించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. వారు ఫిషింగ్‌, పఫిన్‌లను వేటాడటం, పశువులపెంపకంపై ఆధారపడి జీవించేవారని.. 1930 సమయంలో ఆ ఇంట్లో నివసించేవారు ద్వీపం నుంచి వేరే ప్రదేశానికి వలస వెళ్లడంతో 100 ఏళ్లుగా ఆ ప్రదేశం నిర్జీవంగా తయారైందని సమాచారం.

నెటిజన్లు ఈ ఫోటోలపై వివిధ రకాలుగా కామెం‍ట్లు చేస్తున్నారు. ప్రపంచంలోని ఒంటరి ఇల్లు అని... అసలు ఆ ఇల్లు ఇప్పుడు ఉనికిలో లేదని .. ఫోటోషాప్‌లో ఎడిట్‌ చేసిన ఫోటోస్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంత అందమైన ఇంటిపై మరొక పుకారు కూడా ఉంది. ఈ ఇంటిని ఒక బిలీనియర్‌ నిర్మించాడని.. జోంబీ అపోకాలిప్స్ సందర్భంలో అక్కడికి వెళ్లి జీవించాలని  అనుకున్నాడని రూమర్లు వస్తున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top