వ్యాక్సినేషన్‌: టెస్లా కారు, ఇల్లు.. బహుమతుల బొనాంజా

Vaccination: Tesla car, gold bars and whatnots for a jab in Hong Kong  - Sakshi

హాంకాంగ్‌ నగర వాసులకు బంపర్‌ ఆఫర్స్‌

వ్యాక్సిన్‌ తీసుకుంటే  ఖరీదైన టెస్లా కారు, గోల్డ్‌ బార్స్‌,  సొంతిల్లు

హాంకాంగ్‌ : కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి గుడ్‌న్యూస్.  హాంకాంగ్‌ నగరంలో వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన వారికి  ఖరీదైన టెస్లా కార్లను, గోల్డ్‌ బార్లను అందించనున్నాయి అక్కడి కార్పొరేట్‌ సంస్థలు. వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రజలను ప్రోత్సాహించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  ప్రధానంగా లీకా షింగ్  సీకే గ్రూప్, తన ఛారిటబుల్ సంస్థలతో  కలిపి మంగళవారం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న ఫోటోలను  షేర్‌ చేసిన వారికి  లాటరీ ద్వారా 2.6 మిలియన్‌ డాలర్ల విలువైన షాపింగ్‌  వోచర్లను గిఫ్ట్‌గా ఇవ్వనుంది. మరో బిలియనీర్ అడ్రియన్ చెంగ్ నేతృత్వంలోని న్యూ వరల్డ్ గ్రోత్ కో ద్వారా టీకా తీసుకున్న అల్పాదాయ వర్గాల వారికి హాంకాంగ్‌  నగరంలో10 మిలియన్‌ డాలర్లను ఆఫర్‌ చేయనుందని ప్రభుత్వ ముఖ్య అధికారి క్యారీ లామ్ తెలిపారు. 

ఇంటిని గెల్చుకోవచ్చు!
హాంకాంగ్‌లోని పటు కార్పొరేట్‌ కంపెనీలు, రెస్టారెంట్లు తమ ఉద్యోగులకు నగదు చెల్లింపులు, వోచర్లు  ఇతర ప్రయోజనాలను ఇప్పటికే ప్రకటించాయి.   తాజాగా సినో గ్రూప్‌నకు  చెందిన చారిటీ  విభాగం ఎన్జీ టెంగ్ ఫాంగ్ ఛారిటబుల్ ఫౌండేషన్,  చైనీస్ ఎస్టేట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్  సంయుక్తంగా గత నెలలో క్వాన్ టోంగ్ ప్రాంతంలో  1.4 మిలియన్ల  అపార్ట్‌మెంటును బహుమతిగా అందిస్తామని  వెల్లడించాయి.  అలాగే మరో రెండు వేర్వేరు ప్రధాన హాంకాంగ్ కంపెనీలు కూడా ఈ నెలలో ప్రోత్సాహక ప్యాకేజీలను ప్రవేశపెట్టాయి. హాంకాంగ్‌కు చెందిన అతిపెద్ద డెవలపర్ సోలార్ హంగ్ కై ప్రాపర్టీస్ లిమిటెడ్   వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్న వారికి ఐఫోన్‌లతోపాటు, ఇతర బహుమతులను అందిస్తోంది.  బిజినెస్‌ టైకూన్ లీ షా కీ, హెండర్సన్ ల్యాండ్ గ్రోత్ కంపెనీ  గోల్డ్‌ బార్స్‌ ఆఫర్‌ చేస్తోంది. దీంతోపాటు  ఆస్ట్రేలియన్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ ఏజెన్సీ గుడ్‌మాన్ గ్రూప్ ఆగస్టు 31 నాటికి టీకాలు వేసుకున్న వారికోసం ఒక లాటరీని స్కీంను  ప్రకటించింది.  ఒక మిలియన్కు‌ పైగా హాంకాంగ్‌ డాలర్ల బహుమతిని లాటరీ ద్వారా అందిస్తుంది.  ఇందులో భాగంగా  5  లక్షల హాంకాంగ్‌ డాలర్ల విలువైన టెస్లా మన్నెక్విన్ 3  కారును కూడా అందించనున్నామని గుడ్‌మ్యాన్‌ ప్రతినిధి వెల్లడించారు.

చదవండి :  Petrol, diesel prices: పెట్రో బాంబు, రికార్డు ధర
Alzheimer: అల్జీమర్సా..ఈ వీడియో చూస్తే..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top