Petrol, diesel prices: పెట్రో బాంబు, రికార్డు ధర

Petrol, diesel prices hiked again  reach record high - Sakshi

పెట్రోలుపై లీటరుకు 23-25 ​​పైసలు

డీజిల్‌పై  23-27 పైసలు మేర పెంపు

 రికార్డు స్థాయికి పెరిగిన ఇంధన ధరలు

సాక్షి, ముంబై: పెరుగుతున్న ఇంధన ధరలకు అదుపులేకుండా పోతోంది. మంగళవారం స్థిరంగా ఉన్న ధరలు బుధవారం మరో రికార్డు స్థాయికి చేరాయి. పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచుతూ , ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. బుధవారం (జూన్ 9)పెట్రోలు ధరను లీటరుకు 23-25 ​​పైసలు, డీజిల్‌పై 23-27 పైసలు మేర పెంచాయి.  మే 4 నుంచి 22 వ పెంపు.  ఈ నెలలో ఇప్పటి వరకు పెట్రోల్ రిటైల్ ధర లీటరుకు సుమారు 1.07 రూపాయలు పెరిగింది. తాజాగా పెంపుతో ఢిల్లీలో  పెట్రోల్ ధర లీటరుకు రూ .95.56 (25 పైసల పెరుగుదల) డీజిల్ ధర లీటరుకు రూ .86.47 స్థాయికి చేరింది. ముంబైలో పెట్రోలు లీటరుకు  102 (రూ.101.76) రూపాయల వద్ద అత్యధిక స్థాయిని తాకింది. అలాగే దేశంలో రాజస్థాన్, శ్రీగంగానగర్‌లో పెట్రోలు రూ.106.64 వద్ద, డీజిల్‌ రూ.99.50వద్ద గరిష్ట ధరను నమోదు చేయడం గమనార్హం.

దేశంలోని నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ ధరలు లీటరుకు
ముంబైలో పెట్రోలు ధర రూ.101.76  డీజిల్‌  రూ. 93.85
చెన్నైలో పెట్రోలు ధర రూ.96.94,  డీజిల్‌  రూ. 91.15
బెంగళూరులో పెట్రోలు ధర రూ.99.75,  డీజిల్‌  రూ. 91.67
కోలకతా పెట్రోలు ధర రూ. 95.52, డీజల్‌ రూ. 89.32
హైదరాబాదులో పెట్రోలు ధర రూ.99.31,  డీజిల్‌  రూ. 94.26
అమరావతిలో పెట్రోలు ధర రూ101.73, డీజిల్‌  రూ. 96.08
విశాఖపట్టణంలో పెట్రోలు ధర రూ100.49,  డీజిల్‌  రూ. 94.88

చదవండి: బ్యాంకుల జోరు, నిఫ్టీ ఆల్‌టైం హై
బాబోయ్‌ పెట్రోల్‌.. భవిష్యత్తు హైపర్‌ ఛార్జర్లదే

Election 2024

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top