Alzheimer: అల్జీమర్సా..ఈ వీడియో చూస్తే.. | Alzheimer patients Music concert Maestro Seiji Ozawa Zubin Mehta | Sakshi
Sakshi News home page

Alzheimer: అల్జీమర్సా..ఈ వీడియో చూస్తే..

Jun 7 2021 4:35 PM | Updated on Jun 7 2021 4:50 PM

Alzheimer patients Music concert Maestro Seiji Ozawa Zubin Mehta - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  పెద్ద వయసు వారిన ఎక్కువగా బాధించే వ్యాధుల్లోఅల్జీమర్స్‌. మెదడులో కణాలు చనిపోవడంతో సంభవించే నాడీ సంబంధిత వ్యాధి. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్ధ్యం దెబ్బతింటాయి.  బాగా సన్నిహితంగా ఉండేవారిని తప్ప కుటుంబ సభ్యులను కూడా మర్చిపోతారు.  దీంతో ఈ  అల్జీమర్స్‌కు గురైనవారితోపాటు, వారి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన చెందుతూ ఉంటారు. అయితే అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారికి సంగీతం మంచి సాధమని ఇదివరకే పరిశోధనలు నిరూపించాయి. ఈ నేపథ్యంలో అల్జీమర్స్‌ బారిన పడిన కొంతమంది సంగీత సాధనలో, లయబద్ధంగా, శృతి తప్పకుండా ఏ మాత్రం తడబడకుండా ఆయా వాయిద్యాలను వాయించడంలో అద్భుతంగా  నిలిచారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో  ఆకట్టుకుంటోంది.  తమ వారిని తలుచుకొని కొంతమంది భావోద్వేగానికి లోనవుతోంటే.. వారి ప్రతిభకు మేని పులకరించిందంటూ మరి కొంతమంది కమెంట్‌ చేస్తున్నారు. సంగీతం మానవజాతి విశ్వ భాష అంటూ సీజీఓ జావా,   జుబిన్ మెహతాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. భారతీయ ఆర్కెస్ట్రా కండక్టర్, సంగీత దర్శకుడు జుబీన్‌ మెహతా,  అమెరికా ఆర్కెస్ట్రా కండక్టర్, సీజీ ఓజావా ఈ సంగీత కార్యక్రమానికి నేతృత్వం వహించడం విశేషం.

హారున్‌ రషీద్‌ అనే ట్విటర్‌ యూజర్‌ ఈ వీడియోను ట్వీట్‌ చేశారు. స్వయంగా అల్జీమర్స్‌ బాధితుడైన సీజీ ఓజావా సంగీతాన్ని ఏమాత్రం మర్చిపోలేదంటూ కమెంట్‌ చేశారు. అయితే 2016 నాటి వీడియో ఇదనీ, సీజీ ఓజావాకు అల్జీమర్స్‌ వ్యాధిలేదనీ,  క్యాన్సర్‌తో బాధపడుతున్నారని మరో యూజర్‌ వివరణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement