శాండ్‌ విచ్‌ తిని, రూ. 6 లక్షల టిప్‌ ఇచ్చేసింది..! | Sakshi
Sakshi News home page

శాండ్‌ విచ్‌ తిని, రూ. 6 లక్షల టిప్‌ ఇచ్చేసింది..!

Published Sat, Nov 25 2023 5:18 PM

US Woman Accidentally Tips Rs 6 lakh At Subway - Sakshi

అమెరికాకు చెందిన మహిళ పొరపాటున భారీ మొత్తంలో  టిప్‌ ఇచ్చింది.  ఆ తరువాత విషయం తెలిసి లబోదిబోమంది  తప్పయిపోయింది నా డబ్బులు నాకు ఇప్పించండి మొర్రో అంటూ   బ్యాంకును ఆశ్రయించింది. చివరికి ఏమైందంటే..!

అమెరికాలోని  ఇటాలియన్  సబ్ వే రెస్టారెంట్ కు వెళ్లిన కానర్‌ మహిళ  శాండ్‌విచ్  (రూ. 628) ఆర్డర్‌ చేసింది. ఆ తరువాత  బ్యాంక్ ఆఫ్ అమెరికా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి అనుకోకుండా 7వేల డాలర్లు (రూ. 6 లక్షలకు పైగా)  టిప్ ఇచ్చి వెళ్లిపోయింది. ఇది రెస్టారెంట్ సిబ్బంది  తెగ సంతోషడిపోయారు.    గొప్పమనసు అని  పొడిగారు.   కానీ  ఆనక విషయం ఉసూరుమన్నారు. 

ఏం జరిగిందంటే కానర్ చెల్లించాల్సిన డబ్బును ఎంటర్‌  చేయాల్సిన చోట తన ఫోన్‌ నెంబర్లులోని చివరి అంకెల్ని ఎంటర్‌ చేసింది. దీంతో సంబంధం లేకుండానే బ్యాంక్ ఆఫ్ అమెరికా క్రెడిట్ కార్డు  ట్రాన్సాక్షన్ పూర్తి అయింది. చివరికి  బిల్లు చూసిన కార్నర్‌ గుడ్లు తేలేసింది.  బ్యాంకుకు పరుగులు పెట్టింది. తన సొమ్మును తిరిగి ఇవ్వాలన్న ఆమె అభ్యర్థనను  తొలుత తిరస్కరించారు. దీంతో చేసేదేమీ లేక కానర్‌ సబ్ వే మేనేజ్ మెంట్‌ను ఆశ్రయించింది. చివరికి పొరపాటున చెల్లించిన టిప్ మొత్తాన్ని తిరిగిచ్చేందుకు అంగీకరించింది. నెల రోజుల తరువాత క్లయింట్‌కు డబ్బును వాపసుకు అంగీకరించారని బ్యాంకు సిబ్బంది  తెలిపారు.  దీని బతికాను రా దేవుడా అనుకుంటూ ఊపిరి  పీల్చుకుంది.

Advertisement
 
Advertisement