సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో క్షిపణులు గర్జించాయి.. విమానాశ్రయం రక్తసిక్తమైంది.. 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 309 మంది గాయపడినట్టు సమాచారం. రియాద్‌పై జరిగిన ఈ దాడి ఇప్పుడు మధ్యప్రాచ్యాన్ని మరోసారి యుద్ధం అంచులకు తీసుకెళ్తోంది. ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ‘ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు.. హౌతీలపై సౌదీ అరేబియా చేపడుతున్న సైనిక చర్యల్లో అమెరికా కూడా చేరే అవకాశాన్ని తెరపైకి తెచ్చారు. అదే జరిగితే యెమెన్‌లో కొనసాగుతున్న ఘర్షణ మరింత విస్తరించే ప్రమాదం ఉంది. ఇంతకీ ట్రంప్ నేరుగా యుద్ధంలోకి దిగుతారా? హౌతీలకు అమెరికా ఎలాంటి సంకేతాలు పంపుతోంది?.
రియాద్ విమానాశ్రయంపై దాడి నేపథ్యంలో హౌతీలకు వ్యతిరేకంగా సౌదీ అరేబియా చేపడుతున్న సైనిక చర్యల్లో అమెరికా చేరే అవకాశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నారు. ఈ అంశంపై విలేకరులు ప్రశ్నించగా.. ‘చేరవచ్చు.. దీన్ని పరిశీలిస్తాం. ఈ దాడి గురించి ఇప్పుడే తెలుసుకున్నాం. నిర్ణయం తీసుకుంటాం.. మేం చాలా వేగంగా కదులుతాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో అమెరికా ప్రత్యక్ష సైనిక జోక్యంపై చర్చ మొదలైంది. అయితే, అమెరికా ఇప్పటికే యుద్ధంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించలేదు. హౌతీలపై చర్యలకు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ట్రంప్ మాటలు స్పష్టం చేస్తున్నాయి. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో మాట్లాడనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.
🚨 SHOCKING VISUALS FROM RIYADH, SAUDI ARABIA 🇸🇦 A missile attack by Iran-backed Houthi rebels from Yemen on King Khalid International Airport has left 12 people dead and over 300 injured, including a US citizen. 🇺🇸 Meanwhile, After Pakistan's failure to help its umah brother, US President Donald Trump has hinted at joining Saudi strikes against the Houthis, saying: “We may. We’re going to look at it… We move very quickly.” This isn't distant crossfire anymore, it's a full-scale international inferno. https://t.co/TfSPgNYTKY
— Megh Updates 🚨™ (@MeghUpdates) October 11, 2026
అమెరికా హెచ్చరిక.. హౌతీలపై ఒత్తిడి
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సైతం రియాద్ విమానాశ్రయంపై దాడిని తీవ్రంగా ఖండించారు. అమాయక పౌరుల ప్రాణాలను లెక్కచేయని దాడులుగా అభివర్ణించారు. సౌదీ అధికారులతో అమెరికా సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. మరోవైపు.. సౌదీపై దాడులకు తమదే బాధ్యత అంటూ హౌతీ మిలీషియా ప్రకటించింది. యెమెన్‌పై సౌదీ జరుపుతున్న దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్టు తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన తర్వాత గల్ఫ్ దేశాలపై జరిగిన అత్యంత ప్రాణాంతక దాడికి ఇది రికార్డుల్లోకి ఎక్కింది.
🚨Última hora: 🇾🇪🇸🇦| Está sucediendo ahora mismo. Incendios masivos en el MAYOR CAMPO PETROLIFERO del mundo, Campo de Al Ghawar al este de Arabia Saudí esta ardiendo. Ansarullah habían advertido a las potencias occidentales y a Arabia Saudí que pagaran su agresión al Yemen. https://t.co/XP1OruZI9g
— 🔻🇲🇷 MADIBA.🇪🇭🇵🇸🇩🇿🇨🇺🇲🇽 (@MADIBA1150270) October 10, 2026
విమానాశ్రయం మూసివేత..
హౌతీల క్షిపణి దాడి నేపథ్యంలో రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. వందలాది విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించాల్సి వచ్చింది. అమెరికా, బ్రిటన్, కెనడా సహా పలు దేశాలు తమ పౌరులకు విమానాశ్రయం పరిసరాలకు వెళ్లవద్దని సూచించాయి. ఇదిలా ఉండగా.. సౌదీ తూర్పు ప్రాంతంలోని దమ్మామ్ కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోనూ క్షిపణి దాడులు జరిగినట్టు తెలుస్తోంది. దీంతో దేశంలోని కీలక విమానయాన కేంద్రాల భద్రతపై ఆందోళనలు పెరిగాయి.
ప్రాంతీయ యుద్ధంగా మారుతుందా?
యెమెన్‌లో హౌతీలకు, సౌదీ మద్దతు ఉన్న ప్రభుత్వ దళాలకు మధ్య ఘర్షణలు తీవ్రతరం అవుతున్నాయి. ఎర్ర సముద్రానికి కీలకమైన బాబ్ అల్-మండేబ్ జలసంధి పరిసరాల్లోనూ పోరు ఉధృతమవుతోంది. ఈ మార్గం అంతర్జాతీయ వాణిజ్యానికి, ఇంధన రవాణాకు వ్యూహాత్మకంగా కీలకం. ఈ నేపథ్యంలో రియాద్ విమానాశ్రయంపై దాడి పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఇప్పటికే సౌదీ నేతృత్వంలోని కూటమి హౌతీ స్థావరాలపై దాడులు చేస్తుండగా.. అమెరికా కూడా సైనికంగా జోక్యం చేసుకుంటే ఘర్షణ మరింత విస్తరించే అవకాశం ఉంది. అయితే, అమెరికా ప్రత్యక్షంగా పాల్గొంటుందా? లేదా సౌదీకి ఇతర రూపాల్లో సహకరిస్తుందా? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు హౌతీలపై సైనిక ఒత్తిడి పెంచే సంకేతాలుగా కనిపిస్తున్నాయి. కానీ మాటల నుంచి సైనిక చర్యల వరకు అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు కీలకం కానుంది.
ఇదీ చదవండి: ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Following a deadly Houthi strike on Saudi Arabia’s King Khalid International Airport that also killed an American, U.S. President Donald J. Trump said “We may,” when asked if the U.S. would now join strikes against Houthis. Per the president, he is set to call the Saudi crown prince soon to discuss the matter.
— OSINTdefender (@sentdefender) October 11, 2026


