యద్ధాన్ని ఆపేలా పుతిన్‌ని మోదీ ఒప్పించగలారా?

US Asked f PM Modi Could Convince Putin To End Ukraine War - Sakshi

ఉక్రెయిన్‌లో యుద్ధం ఆగడానికి చాలా సమయం పడుతుందని అమెరికా పేర్కొంది. ఇరు దేశాలు శత్రుత్వానికి ముగింపు పలికేలా పలు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందని పిలుపునిచ్చింది. ఆ ప్రయత్నాలన్నింటిని తాను స్వాగతిస్తానని కూడా వెల్లడించింది యూఎస్‌. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్‌ కిర్బీ మాట్లాడుతూ..పుతిన్‌కి ఈ యుద్ధాన్ని ఆపడానికి ఇంకా కొంత సమయం అవసరమని భావిస్తున్నా. ప్రధాని మోదీ పుతిన్‌ ఒప్పించి ఈ యుద్ధాన్ని ముగించేలా చేయగలరా అని ప్రశ్నించారు.

ఒకవేళ మోదీ యుద్ధాన్నే ఆపేలా ఏ ప్రయత్నం చేసినా.. దాన్ని తాను స్వాగతిస్తామని, ఆయనకు అవకాశం ఇస్తామని కిర్బీ అన్నారు. కాగా, భారత్‌ జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ మాస్కోలో పుతిన్‌తో సమావేశమైన కొద్ది రోజుల్లనే వైట్‌హౌస్‌ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఇదిలా ఉండగా, గతేడాది షాంఘై కో ఆపరేషన్‌ సమ్మిట్‌ సందర్భంగా పీఎం మోదీ మాట్లాడుతూ.."నేటి యుగం యుద్ధం కోసం కాదు. ఈ రోజు మనం శాంతి మార్గంలో ఎలా పురోగమించాలి అనే అవకాశాల గురించి చర్చింకునే తరుణం." అని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.  

(చదవండి: ప్లీజ్‌ దేవుడా! ఒక్క బిడ్డనైనా కాపాడు..ఓ బాధిత తం‍డ్రి ఆవేదన)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top