
కీవ్: రష్యాపై ఉక్రెయిన్ మెరుపు దాడికి దిగింది. తాజాగా ఉక్రెయిన్ చేసిన దాడుల్లో 40కి పైగా రష్యా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. .యుద్ధంలో ఇప్పటివరకు ఉక్రెయిన్ చేపట్టిన అతిపెద్ద సైనిక చర్య ఇదే కావడం గమనార్హం. ఇది రష్యా వైమానిక బలగాలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.రష్యాపై తాము చేసిన దాడుల్లో 40 ఎయిర్ క్రాఫ్ట్‌లు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ మీడియా స్పష్టం చేసింది. సరిహద్దు నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తూర్పు సైబీరియాలోని పలు సైనిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడిందని తెలిపింది.
ఇర్కుట్స్క్ ప్రాంత రష్యన్ గవర్నర్ ఈ దాడిని ధృవీకరించారు. శ్రీద్ని గ్రామంలోని సైనిక యూనిట్‌పై కీవ్ ఎటాక్ చేసిందని ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ సైబీరియాలోని ఒలెన్యా, బెలయాలోని వైమానిక స్థావరాలతో సహా నాలుగు రష్యన్ సైనిక వైమానిక స్థావరాపై ఏకకాలంలో దాడులు చేసింది.
2 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తి నష్టం!
ఈ విధ్వంసకర దాడుల కారణంగా సుమారు 2 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ఈ దాడులు యుద్ధ పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉక్రెయిన్ ఇటీవలి కాలంలో డ్రోన్ టెక్నాలజీలో గణనీయమైన పురోగతి సాధించినట్లు ఈ దాడుల ద్వారా తెలుస్తోంది. అయితే ఉక్రెయిన్ దాడుల్లో ఏడుగురు మృతి చెందగా, 69 మందికి గాయాలయ్యాయి. 524 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేశామని రష్యా చెబుతోంది.