ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు బ్రిటన్‌ ఓకే

 UK Authorizes Covid-19 Vaccine From Oxford and AstraZeneca - Sakshi

లండన్‌/న్యూఢిల్లీ/బీజింగ్‌: ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా అభివృద్ధిపరిచిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి బ్రిటన్‌ అనుమతిచ్చింది. బయోటెక్‌ ల్యాబ్స్‌ ఫైజర్‌ టీకా తరువాత యూకె.. ఓకే చెప్పిన రెండో కరోనా టీకాగా ఆస్ట్రాజెనెకా కోవిడ్‌ వ్యాక్సిన్‌ మరో వారం రోజుల్లో బ్రిటన్‌ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ వ్యాక్సిన్‌ని బ్రిటిష్‌ రెగ్యులేటరీ మెడిసిన్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ(ఎంహెచ్‌ఆర్‌ఏ) పరిశీలించింది. ఈ వ్యాక్సిన్‌ సురక్షితమైనదీ, శక్తివంతమైనదని ఎంహెచ్‌ఆర్‌ఏ నిర్ధారించింది.సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వెల్లడించారు. జనవరి 4 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభించనున్నట్టు బ్రిటన్‌ ఆరోగ్య మంత్రి మాట్‌ హాన్‌కాక్‌ తెలిపారు.  

భారత్‌లో ఇలా..
ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి బ్రిటన్‌ ఓకే చెప్పడంతో భారత్‌లో ౖ టీకా వాడకానికి అనుమతికోసం సీరం కంపెనీ ఎదురుచూస్తోంది. ఆస్ట్రాజెనెకా టీకాను సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తోంది. పుణేకి చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ భారత్‌లో ఈ టీకా అత్యవసర వినియోగం కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం పరిగణనలోనికి తీసుకుంది. వీరు అందించిన వ్యాక్సిన్‌ సంబంధిత సమాచారాన్ని ప్యానల్‌ పరిశీలిస్తోంది. శుక్రవారం నిపుణుల బృందం సమావేశం జరగనుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top