Earthquakes: జపాన్‌ తీరంలో రెండు భూకంపాలు | Two Back To Back Earthquakes Near Japan Coast | Sakshi
Sakshi News home page

Earthquakes: జపాన్‌ తీరంలో రెండు భూకంపాలు

Dec 28 2023 4:21 PM | Updated on Dec 28 2023 6:15 PM

Two Back To Back Earthquakes Near Japan coast - Sakshi

టోక్యో: జపాన్‌ సముద్ర తీరంతో గంట వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. గురువారం అర్థగంట వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించింది. మొదటి భూకంపం​ రిక్టర్‌ స్కేల్‌పై 6.5 తీవ్రత, రెండో భూకంపం రిక్టర్‌ స్కేల్‌పై 5.0 తీవ్రతో  నమోదైనట్లు యునైటెడ్‌ స్టేట్స్‌ జీయోలాజీకల్‌ సర్వే(USGS) తెలిపింది.  

జపాన్‌లోని కురిల్ దీవుల్లో గురువారం మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో మొదటి భూకంపం నమోదు కాగా, రెండో భూకంపం మధ్యాహ్నం 3.07 గంటల సమయంలో సంభవించింది. యునైటెడ్‌ స్టేట్స్‌ జీయోలాజీకల్‌ సర్వే తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రెండు భూకంపాలు సముద్రంతో 23.8 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల లోతులో సంభవించినట్లు తెలిపింది.  అయితే రెండు సార్లు సంభవించిన ఈ భూకంపాల్లో ఎటువంటి ప్రాణ, ఆ‍స్తి నష్టం జరగలేదని ఆధికారులు వెల్లడిం‍చారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement