‘డాన్‌ తిరిగొచ్చాడు’.. ప్రపంచ వార్తా పత్రికల్లో.. | Here's How Worlds Newspapers Covered Donald Trumps Victory In US Presidential Elections, Photos Goes Viral | Sakshi
Sakshi News home page

Newspapers On Trump Victory: ‘డాన్‌ తిరిగొచ్చాడు’.. ప్రపంచ వార్తా పత్రికల్లో..

Nov 7 2024 10:01 AM | Updated on Nov 7 2024 10:46 AM

Trumps Victory Reflected in Worlds Newspapers

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అమోఘ విజయం సాధించారు. యావత్‌ ప్రపంచం దృష్టి అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే కేంద్రీకృతమైన నేపధ్యంలో.. ట్రంప్‌ విజయం తరువాత అన్ని దేశాలు ఆయనను అభినందనలతో ముంచెత్తుతున్నాయి. అలాగే ప్రపంచంలోని పలు వార్తా పత్రికలు ట్రంప్‌ విజయాన్ని పతాక శీర్షికన ప్రచురించాయి. ‘డాన్‌ తిరిగొచ్చాడు’ అంటూ ఒక వార్తా పత్రిక పతాక శీర్షికన ట్రంప్‌ పునరాగమనాన్ని స్వాగతించింది.  

డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత ప్రపంచమంతా ఆయన పునరాగమనానికి శుభాకాంక్షలు చెబుతోంది.

అన్ని దేశాల్లోని వార్తాపత్రికల మొదటి పేజీల్లోనూ డొనాల్డ్ ట్రంప్ విజయం పతాక శీర్షికన నిలిచింది.

అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి విజయం సాధించారు.

హనోయిలో వియత్నామీస్ వార్తాపత్రికలోనూ డొనాల్డ్ ట్రంప్ విజయంపై స్పందనలను ప్రచురించారు.

మెల్బోర్న్ వార్తాపత్రికల మొదటి పేజీలోనూ నూతనంగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయంపై వార్త ప్రచురించారు.

డొనాల్డ్ ట్రంప్ భారతీయ వార్తాపత్రికల మొదటి పేజీలలో చోటు దక్కించుకున్నారు.

డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక విజయానికి ప్రతిస్పందనలు వార్తాపత్రికలలో ప్రచురితమయ్యాయి.

కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి పోటీ ఇవ్వాలనుకున్నా, అమెరికా ప్రజలు మరోసారి ట్రంప్‌కు పట్టంకట్టారు.

అమెరికాలో మరోసారి డొనాల్డ్ ట్రంప్ మాయాజాలం ఫలించింది.

ట్రంప్ చారిత్రాత్మక పునరాగమనాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా వీక్షించారు. 

ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికలు.. రోదించిన కమలా హారిస్‌ మద్దతుదారులు

Advertisement
 
Advertisement
Advertisement