ప్రధాని మోదీకి ప్రతిష్టాత్మక అవార్డు | Trump Presents Legion Of Merit To Prime Minister Narendra Modi | Sakshi
Sakshi News home page

'అమెరికా లిజియన్ ఆఫ్ మెరిట్' అవార్డు

Dec 22 2020 9:33 AM | Updated on Dec 22 2020 10:29 AM

Trump Presents Legion Of Merit To Prime Minister Narendra Modi - Sakshi

వాషింగ్టన్‌ : ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అమెరికా లిజియన్ ఆఫ్ మెరిట్ అవార్డు వరించింది. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతానికి కృషిచేసినందుకు గానూ మోదీకి ఈ అవార్డును అందజేశారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాజర్ట్‌ ఓబ్రెయిన్‌ చేతులమీదుగా మోదీ తరుఫున భారత రాయబారి తరణ్‌జిత్ ఈ అవార్డును స్వీకరించారు. ఇండియా-అమెరికా మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ప్రధాని మోదీ కృషి చేసినందుకు ఆయను ఈ అవార్డును ప్రకటించినట్టు ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. యూఎస్ మిలటరీ విభాగంలో అత్యన్నత పురస్కారంగా భావించే  ఈ అవార్డును ఇతర దేశాల ప్రభుత్వాధినేతలకు ప్రధానం చేస్తారు. 

యూఎస్ - ఇండియా సంబంధాలు మరింతగా బలపడటం వెనుక నరేంద్ర మోదీ ఎంతో కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా  రాబర్ట్ ఓబ్రియన్ కొనియాడారు. ఆయన దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు ప్రపంచం ముందున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సహకరిస్తున్నాయని ట్వీట్‌ చేశారు. భారత్‌- అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపొందించడం, భారత్ ప్రపంచ శక్తిగా ఎదిగేలా పాటుపడుతున్నందుకు  మోదీకి ఈ అవార్డు లభించింది. గతంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, జపాన్‌ ప్రధాని షింజో అబేలకు కూడా అమెరికా లిజియన్ ఆఫ్ మెరిట్ అవార్డు దక్కింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement