కమల కంటే నేనే మంచిగా కనిపిస్తా: ట్రంప్‌ సెటైర్లు | Trump personal attacks on Kamala Harris i'm much better looking | Sakshi
Sakshi News home page

కమల కంటే నేనే మంచిగా కనిపిస్తా: ట్రంప్‌ సెటైర్లు

Aug 18 2024 9:59 AM | Updated on Aug 18 2024 11:38 AM

Trump personal attacks on Kamala Harris i'm much better looking

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికల రేసులో ప్రధాన అభ్యర్థులైన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,  డొమోక్రటిక్‌ అభ్యర్థి, ఉపాధ్యాక్షురాలు కమలా హారిస్‌ మధ్య విమర్శలు పెరుగుతున్నాయి.  ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి కమలా హారిస్‌ కంటే తానే చూడడానికి మంచిగా కనిపిస్తున్నానని అన్నారు. పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌ పాల్గొని మాట్లాడారు. ‘చూడటానికి కమల కంటే నేను చాలా బాగుంటాను. ఆమెతో పోల్చితే.. నేను మంచిగా ఉంటానని భావిస్తున్నా. తెలివితేటలు గల వ్యక్తిగా కనిపిస్తాను’అని అన్నారు.

‘‘ది వాల్ స్ట్రీట్ జర్నల్‌’’లో కమల అందాన్ని వర్ణిస్తూ కాలమిస్ట్ పెగ్గీ నూనన్‌ ఓ వ్యాసాన్ని రాశారు. అయితే వ్యాసాన్ని ఉద్దేశించి ట్రంప్‌.. ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే.. రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థి డేవిడ్ మెక్‌కార్మిక్‌ను ఉద్దేశించి.. ‘‘డేవిడ్.. దయచేసి స్త్రీని అందంగా ఉ‍న్నారని ఎప్పుడూ పొగడకండి. ఎందుకంటే అది మీ రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతుంది’’ అని అన్నారు. టైమ్ మ్యాగజైన్ కవర్‌పై కమలా ఫొటోను ప్రస్తావిస్తూ.. అందులో ఉన్నది హీరోయిన్లు సోఫియా లోరెన్ లేదా ఎలిజబెత్ టేలర్ అనుకున్నానని సెటైర్లు వేశారు. 

శుక్రవారం కమల ప్రకటించిన ఆర్థిక ప్రణాళికను.. యుఎస్‌లో కమ్యూనిజానికి దారితీసే ప్రణాళిక అని ట్రంప్‌ ఆరోపణలు చేశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో గత మూడు వారాలుగా కమలపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వ్యక్తిగత దూషణలకు సైతం ట్రంప్‌ వెనుకాడడం లేదు. కమలకు ‘పిచ్చి’ ఉందని కూడా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement