Trending News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

Top10 Telugu Latest News Morning Headlines 15th June 2022 - Sakshi

1. ఏపీ వాసులకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్‌.. రెండు, మూడు రోజుల్లో..


రాయలసీమలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు నెమ్మదిగా రాష్ట్రమంతా విస్తరిస్తున్నాయి. రెండు, మూడు రోజుల్లో రాయలసీమలోని మరికొన్ని ప్రాంతాలకు, తర్వాత నాలుగైదు రోజుల్లో కోస్తాంధ్రలో విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. Ukraine-Russia War: ‘తూర్పు’పై రష్యా పట్టు 


తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా క్రమంగా పట్టు సాధిస్తోంది. అక్కడ 80 శాతం ఇప్పటికే రష్యా చేతిలోకి వెళ్లిపోయింది. అక్కడి డొనెట్స్‌క్‌ ప్రాంతంలో కీలక నగరమైన సెవెరోడొనెట్స్‌క్‌ను కూడా రష్యా సేనలు దాదాపుగా ఆక్రమించుకున్నాయి.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. వామ్మో.. భారతీయుల ఆయుష్షు ఐదేళ్లు ఫట్‌!


వాయు కాలుష్యం దేశ ప్రజల ఆరోగ్యానికి పెను ముప్పుగా మారింది. కాలుష్యం కట్టడికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలు పాటించకపోతే సగటు భారతీయుడి ఆయుర్దాయం ఏకంగా ఐదేళ్లు తగ్గుతుందని తాజా సర్వే ఒకటి హెచ్చరించింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. న్యూఢిల్లీ: విపక్షాలతో దీదీ భేటీ.. ఆసక్తి రేపుతున్న రాష్ట్రపతి ఎన్నికలు!


రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిపై కార్యాచరణకు పశ్చిమబెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మమతా బెనర్జీ బుధవారం న్యూఢిల్లీలో విపక్షాలతో భేటీ కానున్నారు. ఇందులో పాల్గొనాలని కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ, విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలతోపాటు 22 పార్టీలకు ఆమె లేఖ రాయడం తెలిసిందే.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. మమత భేటీకి టీఆర్‌ఎస్‌ దూరం!


వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో నిర్వహిస్తున్న సమావేశానికి దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. విశాఖలో విజయగర్జన


వైజాగ్‌ తీరం ఎట్టకేలకు టీమిండియాను విజయతీరానికి చేర్చింది. ఓపెనింగ్‌ హిట్టయినా... మిడిలార్డర్‌ నిరాశపరిచింది. అయితే బౌలింగ్‌ కూడా సూపర్‌ హిట్‌ కావడంతో భారత్‌ వరుస పరాజయాలకు బ్రేక్‌ పడింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. Godse Director: అదే విషయాన్ని ‘గాడ్సే’తో సీరియస్‌గా చెప్పే ప్రయత్నం చేశాం


‘కొన్ని సినిమాలు చూసి ప్రజలు చెడిపోతున్నారని కొందరు అభిప్రాయపడుతుంటారు. కానీ అదే సినిమాల్లో మంచి చెప్పినప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ‘గాడ్సే’ ప్రేక్షకులను ఆలోచింపజేసే చిత్రం’’ అన్నారు దర్శకుడు గోపీ గణేష్‌ పట్టాభి.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. బీజేపీకి మిత్తితో సహా చెల్లిస్తాం


వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందనే భయం బీజేపీకి పట్టుకుందని, అందుకే మూసేసిన కేసులో సోనియా, రాహుల్‌లకు ఈడీ నోటీసులి చ్చిందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. నరకమే ‘నారాయణ’ 


హాస్టల్‌లో ఆహారం సరిగా లేదని బయట నుంచి పార్శిళ్లు తెచ్చుకున్న ఇంటర్‌ విద్యార్థులను నారాయణ జూనియర్‌ కాలేజీ సిబ్బంది చితకబాదారు. కాళ్లతో తన్ని కర్రలతో కొడుతూ విచక్షణా రహితంగా ప్రవర్తించడంతో ఇద్దరు విద్యార్థులు స్పృహ కోల్పోయారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. మీరూ మీ ఇల్లూ వానలకు రెడీయేనా?


దూరాన మేఘాలు గర్జిస్తున్నాయి. ఆకాశం నీళ్ల ధారలు కుమ్మరించనుంది. మరి వానలకు మీ ఇల్లు సిద్ధమేనా? కొట్టాల్సిన కొమ్మలు నాటాల్సిన మొక్కలు చెక్‌ చేయాల్సిన పైకప్పులు వాననీళ్లు పారాల్సిన తూములు విద్యుత్‌ తీగల నుంచి భద్రత దోమల నివారణకు తెరలు పిల్లలకై తీసుకోవాల్సిన జాగ్రత్తలు... రెడీ అవుదాం.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top