
ఇటీవల థాయ్‌లాండ్‌లో వెలుగుచూసిన బౌద్ధ సన్యాసుల సెక్స్ స్కాండల్ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది దీనికి ప్రధాన సూత్రధారిగా ఉన్న 30 ఏళ్ల విలావన్ ఎమ్‌సావత్ అనే మహిళను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన థాయ్‌లాండ్ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనాలు సృష్టించడంతో ఆ స్కాండల్‌కు సంబంధించి ఒక్కో విషయం బయటకు వస్తోంది.
80 వేల న్యూడ్ ఫోటోలు.. రూ. 100 కోట్లు దోచేసింది!
బౌద్ధ సన్యాసులతో లైంగిక సంబంధాలు కొనసాగించిన విలావన్ ఎమ్ సావత్ అనే మహిళ.. సుమారు 80 వేల న్యూడ్ ఫోటోలు తీసుకుంది. వీటి ద్వారా బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడి సుమారు వంద కోట్లకు పైగానే వెనుకేసింది. కాగా, చివరకు ఈ ఉదంతం బయటకు రావడంతో ఆమె అరెస్ట్ కావడమే కాదు.. విలావత్ జరిపిన ఆర్థిక లావాదేవీల వ్యవహారం బయటకొచ్చింది. మనీ ల్యాండరింగ్ ఆరోపణలతో ఆమె ఖాతాలను తనిఖీ చేయగా సుమారు రూ. 102 కోట్లు దోపిడీ చేసింది. ‘Mrs. గోల్ఫ్’గా పేరు మార్చుకుని లైంగిక సంబంధాలు జరిపిన ఆ మహిళపై దోపిడీ, మనీలాండరింగ్ తదితర కేసులు నమోదు అయ్యాయి.
ఈ వ్యవహారం బయటపడిన తర్వాత పదవుల్లో ఉన్న సీనియర్ బౌద్ధ సన్యాసులను తొలగించారు దీనిపై విస్తృత స్థాయిలో విచారణకు రంగం సిద్ధం చేసింది థాయ్ ప్రభుత్వం. మరొకవైపు బౌద్ధ సన్యాసులు బ్రహ్మచర్యం పాటించాల్సిన నియమాన్ని ఉల్లంఘించిన కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఎవరీ విలావన్ ఎమ్ సావత్?
విలావన్ ఎమ్ సావత్.. సెక్స్ స్కాండల్ వ్యవహారానికి ప్రధాన పాత్రధారి. బౌద్ధ సన్యాసులే టార్గెట్‌గా ఆమె చేసిన దోపిడీ అంతా ఇంతా కాదు. ‘ శ్రీమతి గోల్ఫ్’ అనే పేరుతో థాయిలాండ్‌లోని బౌద్ధ సమాజాన్ని కుదిపేసిన భారీ కుంభకోణంలో కేంద్ర బిందువుగా మారింది. ఆమె వయసు 35 ఏళ్ల నుంచి 39 ఏళ్ల వరకూ ఉంటుంది. ఆమె గత మూడు సంవత్సరాలుగా కనీసం తొమ్మిది మంది సన్యాసులను బ్లాక్‌మెయిల్ చేసి, రూ. 100 కోట్లు వసూలు చేసిందనేది ప్రధాన ఆరోపణ. నార్త్ బ్యాంకాక్ నోంతబురిలోని ఆమెకు ఒక లగ్జరీ హౌస్ ఉంది. ఆమెను అదే ఇంట్లో పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై సీరియస్‌గా దృష్టి సారించారు థాయ్ పోలీసులు. ఓ బౌద్ధ సన్యాసి కారణంగా తల్లి అయినట్లు కూడా చెబుతున్న విలావన్ కేసు ఎంతవరకూ వెళుతుందో చూడాలి.