ఎలాన్‌ మస్క్ కు 11వ బిడ్డ | Tesla CEO Elon Musk has another child with a Neuralink director Shivon Zilis | Sakshi
Sakshi News home page

ఎలాన్‌ మస్క్ 11వ బిడ్డ

Published Mon, Jun 24 2024 5:29 AM | Last Updated on Mon, Jun 24 2024 5:29 AM

Tesla CEO Elon Musk has another child with a Neuralink director Shivon Zilis

న్యూయార్క్‌: ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్‌ ఎక్స్, న్యూరాలింక్‌ సంస్థల సీఈఓ ఎలాన్‌ మస్క్‌ మరోసారి తండ్రయ్యారు. న్యూరాలింక్‌ స్పెషల్‌ ప్రాజెక్ట్స్‌ హెడ్‌ శివోన్‌ జిలిస్‌ ద్వారా ఆయనకు కొన్ని రోజుల క్రితం మూడో బిడ్డ జన్మించినట్లు బ్లూమ్‌బర్గ్‌ సంస్థ వెల్లడించింది. దీంతో మస్క్‌ పిల్లల సంఖ్య ఇప్పటిదాకా 11కు చేరుకున్నట్లు తెలియజేసింది. మస్క్ కు మొదటి భార్య, రచయిత్రి జస్టిన్‌ మస్క్‌ ద్వారా ఐదుగురు బిడ్డలు కలిగారు. 

సంగీత కళాకారిణి గ్రిమ్స్‌ ద్వారా ముగ్గురు పిల్లులు, శివోన్‌ జిలిస్‌ ద్వారా మరో ముగ్గురు పిల్లలు జని్మంచారు. ఎలాన్‌ మస్క్, శివోన్‌ జిలిస్‌కు 2021లో కవలలు పుట్టారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో జననాల రేటు పడిపోతుండడంతో జనాభా తగ్గిపోతోందని మస్క్‌ 2021లో ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే జనాభాను పెంచాలని, వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు. పిల్లలను కనకపోతే నాగరికత అంతమైపోతుందని చెప్పారు. అత్యధికంగా తెలివితేటలు, మేధాశక్తి ఉన్న వ్యక్తులు పిల్లలను ఎక్కువగా కనాలన్నది మస్క్‌ అభిప్రాయం. ఆయనకు తన సంస్థల్లో పనిచేసే మహిళలతో వివాహేతర సంబంధాలున్నాయని ఆరోపణలున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement