వేలెడంత.. బారెడంత..

The tallest boy in the world - Sakshi

ప్రపంచంలోనే అత్యంత పొడవైన అబ్బాయి.. అత్యంత పొట్టి అమ్మాయి.. ఇద్దరూ ఒకచోట చేరితే.. ఇదిగో ఇలా ఉంటుంది. ఇతడి పేరు సుల్తాన్‌ కోసెన్‌.. వయసు 41 ఏళ్లు.. టర్కీకి చెందిన కోసెన్‌ పొడవు ఏకంగా 8 అడుగుల 3 అంగుళాలు.. మరి ఈమె పేరు జ్యోతి ఆమ్గే.. వయసు 30 ఏళ్లు..ఇండియాకు చెందిన ఈమె పొడవు కేవలం రెండు అడుగులే.

ఇద్దరి మధ్య తేడానే ఆరు అడుగులకన్నా ఎక్కువ. సుమారు ఆరేళ్ల కింద ఈజిప్ట్‌ పిరమిడ్ల దగ్గర ఈ ఇద్దరితో నిర్వహించిన ఫొటోషూట్‌ అప్పట్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. మళ్లీ రెండు రోజుల కింద అమెరికాలోని కాలిఫోర్నియాలో మరో ఫొటో షూట్‌ కోసం వారిద్దరూ కలిశారు. అక్కడ తీసిన చిత్రాలే ఇవి. 

అకొండ్రోప్లాసియాగా పిలిచే లోపం వల్ల జ్యోతి ఎదుగుదల లేక మరుగుజ్జులా ఉండిపోతే.. పిట్యుటరీ గ్రంథిలో ట్యూమర్‌తో గ్రోత్‌ హార్మోన్‌ విపరీతంగా ఉత్పత్తయి కోసెన్‌ ఇలా భారీగా ఎదిగిపోయాడు.

whatsapp channel

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top