పైశాచికం: ఎనిమిది మంది మోడల్స్‌పై గ్యాంగ్‌ రేప్‌.. 67 మంది అరెస్ట్‌

South Africa Models Gang Rape Police Arrest 67 Suspects - Sakshi

జోహెన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాలో అక్రమ చొరబాటుదారులు పైశాచికానికి తెగబడ్డారు. మ్యూజిక్‌ వీడియో షూట్‌లోకి ఆయుధాలతో చొరబడి.. మోడల్స్‌పై గ్యాంగ్‌ రేప్‌నకు పాల్పడ్డారు. అంతేకాదు.. మగవాళ్ల దుస్తులు ఊడదీసి.. వాళ్లతో డ్యాన్సులు చేయించి మరీ పైశాచిక ఆనందం పొందారు. 

దక్షిణాఫ్రికా జోహెన్నెస్‌బర్గ్‌ పశ్చిమంగా ఉన్న క్రూగర్స్‌డ్రాప్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు శుక్రవారం వెల్లడించారు. నిందితులను జామా జామాలుగా గుర్తించిన జోహెన్నెస్‌బర్గ్‌ పోలీసులు.. అక్రమ మైనింగ్‌ కోసం పొరుగు ప్రాంతాల నుంచి అక్రమంగా చొరబడతారని, తరచూ దోపిడీలకు పాల్పడతారని వెల్లడించారు. 

వాళ్లు దాడి చేసింది దోపిడీ కోణంలోనే అయినా.. మోడల్స్‌ కనిపించేసరికి అత్యాచారానికి తెగబడ్డారని, ఇలా జరగడం ఇదే మొదటి ఘటన అని పోలీసులు తెలిపారు. బాధితులంతా 35 ఏళ్ల లోపువాళ్లేనని తెలుస్తోంది. ఆపై మగవాళ్లతో నగ్న నృత్యాలు చేయించి.. వాళ్ల దగ్గర ఉన్న సొమ్ము, నగలను దోచుకెళ్లారు. గుంపుగా దుండగులు దాడి చేసినట్లు బాధితులు వెల్లడించగా.. 67 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

వీళ్లలో చాలామంది అక్రమ చొరబాటులేనని నిర్ధారించారు. ఇక ఘటనపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా స్పందించారు. అలాంటి మృగాలకు బతికే హక్కు లేదని, కఠిన శిక్ష విధించి తీరతామని తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top