మైక్రోసాఫ్ట్‌లోకి సామ్‌ ఆల్ట్‌మ్యాన్‌ | Sam Altman, Greg Brockman to join Microsoft | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్‌లోకి సామ్‌ ఆల్ట్‌మ్యాన్‌

Nov 21 2023 5:24 AM | Updated on Nov 21 2023 5:24 AM

Sam Altman, Greg Brockman to join Microsoft - Sakshi

వాషింగ్టన్‌: కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో చర్చనీయాంశంగా మారిన సామ్‌ ఆల్ట్‌మ్యాన్‌ ఉద్వాసన పర్వం కొత్త మలుపు తీసుకుంది. ఓపెన్‌ఏఐ సంస్థ సీఈవో పదవి నుంచి తీసేశాక సామ్‌ ఆల్ట్‌మ్యాన్‌ తాజాగా మైక్రోసాఫ్ట్‌లో చేరి పోయారు.

ఈ విషయాన్ని స్వయంగా మైక్రోసాఫ్ట్‌ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల సోమవారం ట్వీట్‌ చేశారు. ఆల్ట్‌మ్యాన్‌ను తొలగించిన కొద్దిసేపటికే ఓపెన్‌ఏఐ సహవ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రెగ్‌ బ్రోక్‌మ్యాన్‌ సైతం ఓపెన్‌ఏఐ నుంచి వైదొలగారు. ‘‘ ఆల్ట్‌మ్యాన్, బ్రోక్‌మ్యాన్‌ ఇద్దరూ మైక్రోసాఫ్ట్‌ నూతన అడ్వాన్స్‌డ్‌ ఏఐ రీసెర్చ్‌ బృందంలో కలిసి పనిచేస్తారు’’ అని నాదెళ్ల ట్వీట్‌చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement