బైడెన్‌ గెలుపును గుర్తించను: పుతిన్‌ | Russian President Vladimir Putin Comments On Joe Biden | Sakshi
Sakshi News home page

బైడెన్‌ గెలుపును గుర్తించను: పుతిన్‌

Nov 23 2020 8:11 AM | Updated on Nov 23 2020 2:28 PM

Russian President Vladimir Putin Comments On Joe Biden - Sakshi

మాస్కో : ఏ అమెరికా నాయకుడితోనైనా తాను కలిసి పని చేస్తానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆదివారం అన్నారు. అయితే, అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్‌ విజయాన్ని గుర్తించడానికి తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసం పొందిన నాయకుడే ఎన్నికల్లో గెలుస్తాడని చెప్పారు. ఆ విజయాన్ని ప్రతిపక్షం కూడా గుర్తించాలన్నారు. ఫలితాన్ని చట్టబద్ధంగా ప్రకటిస్తే  గుర్తిస్తామని పేర్కొన్నారు. డొనాల్డ్‌ ట్రంప్, పుతిన్‌ సన్నిహిత మిత్రులన్న ప్రచారం ఉంది. జో బైడెన్‌ అధ్యక్షుడైతే రష్యాపై మరిన్ని ఆంక్షలుంటాయని పుతిన్‌ అనుమానిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement